Page Loader
IPL: ఐపీఎల్ 2025.. కోహ్లీ అరుదైన 3 రికార్డులు నమోదు 
ఐపీఎల్ 2025.. కోహ్లీ అరుదైన 3 రికార్డులు నమోదు

IPL: ఐపీఎల్ 2025.. కోహ్లీ అరుదైన 3 రికార్డులు నమోదు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
11:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి చరిత్ర సృష్టించాడు. మంగళవారం జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతూ ఒక్క మ్యాచ్‌లో మూడు అద్భుతమైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈమ్యాచ్‌లో 54పరుగులు చేసిన కోహ్లీ,అవుట్ అయినా రికార్డుల పరంపర మాత్రం కొనసాగింది. ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక అర్ధశతకాలు సాధించిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన సాధించిన హాఫ్ సెంచరీల సంఖ్య 63కు చేరింది. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ 62అర్ధశతకాలు నమోదు చేశాడు.

వివరాలు 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున 9000 పరుగుల మైలురాయి

తాజా మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసినదాంతో కోహ్లీ వార్నర్ రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున 9000 పరుగుల మైలురాయిని చేరిన ఏకైక ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఈ గణనీయమైన ఘనతను కూడా లక్నోతో జరిగిన ఇదే మ్యాచ్‌లో నమోదు చేశాడు. మొత్తం 271 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను అందుకున్నాడు. ఇది మాత్రమే కాకుండా, ఒక్క ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సార్లు 600కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ తన పేరును మరో ప్రత్యేకమైన రికార్డులో లిఖించించుకున్నాడు. ఈ విధంగా.. ఒక్క మ్యాచ్‌లోనే మూడు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకుంటూ, విరాట్ కోహ్లీ మళ్ళీ తన క్లాస్‌ను నిరూపించుకున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేసిన ట్వీట్