Loading...
Virat Kohli - Sachin: సచిన్‌ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అరుదైన క్లబ్‌లోకి ఎంట్రీ
సచిన్‌ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అరుదైన క్లబ్‌లోకి ఎంట్రీ

Virat Kohli - Sachin: సచిన్‌ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అరుదైన క్లబ్‌లోకి ఎంట్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ అరుదైన క్లబ్‌లోకి చేరాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ సాధించాడు. ఈ శతకంతో వన్డే క్రికెట్‌లో 15 వేలకుపైగా పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. విరాట్ కంటే ముందు ఈ ఘనత సాధించిన ఆటగాడు సచిన్‌ తెందుల్కర్ మాత్రమే కావడం గమనార్హం.

వివరాలు

కోహ్లీనే బెస్ట్..

సచిన్‌ తెందుల్కర్ 463 వన్డేల్లో 452 ఇన్నింగ్స్‌లు ఆడి మొత్తం 18,426 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ 315 వన్డేల్లోనే 15 వేలకుపైగా పరుగులు సాధించాడు.

అయితే, సచిన్‌ 15 వేల పరుగుల మార్క్‌ను చేరుకోవడానికి 377 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. విరాట్ మాత్రం కేవలం 303 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.

దీంతో 15 వేల పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా చేరుకున్న విషయంలో విరాట్ కోహ్లీ సచిన్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

ప్రస్తుత తరం ఆటగాళ్లలో విరాట్ కోహ్లీకి సమీపంలో రోహిత్ శర్మ ఉన్నప్పటికీ.. అతడు 11,927 పరుగులతో కోహ్లీకి దూరంగానే ఉన్నాడు.

ADVERTISEMENT