Page Loader
Ranji Trophy 2025: విరాట్ కోహ్లీ కీలక ప్రకటన.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధం 
విరాట్ కోహ్లీ కీలక ప్రకటన.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధం

Ranji Trophy 2025: విరాట్ కోహ్లీ కీలక ప్రకటన.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశారు. దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ, 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి హాజరుకానున్నట్లు తెలిపారు. గతంలో 2012లో రంజీ మ్యాచ్ ఆడిన కోహ్లీ, ఇప్పుడు మళ్లీ ఆప్రముఖ టోర్నీలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. రంజీ ట్రోఫీకి సంబంధించిన మ్యాచ్‌లు జనవరి 23 నుంచి దిల్లీ, సౌరాష్ట్ర మధ్య జరుగుతాయి. అయితే, కోహ్లీ మెడ నొప్పితో బాధపడుతున్న కారణంగా ఈ మ్యాచ్‌లో పాల్గొనలేకపోతున్నట్లు సమాచారం. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ కోసం కోహ్లీ అందుబాటులో ఉంటారని సమాచారం. ఈ విషయాన్ని కోహ్లీ దిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశారని,జట్టు ప్రధాన కోచ్ శరణ్‌దీప్ సింగ్ వెల్లడించారు.

వివరాలు 

మహ్మద్ షమీ రీఎంట్రీ

ఇక,బీసీసీఐ ఇటీవల అన్ని ప్లేయర్లను దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాలని ఆదేశించింది. స్టార్ ఆటగాళ్లకు కూడా మినహాయింపులు ఇవ్వరని స్పష్టం చేసింది.ఈ నిర్ణయం నేపథ్యంలో,కెప్టెన్ రోహిత్ శర్మ (ముంబయి),రిషబ్ పంత్ (దిల్లీ),రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), శుభ్‌మన్ గిల్ (పంజాబ్), యశస్వి జైస్వాల్ (ముంబయి)వంటి ప్రముఖ క్రికెటర్లు ఈసారి రంజీ ట్రోఫీలో పాల్గొనబోతున్నారు. ఇక, రేపటి నుంచి (జనవరి 22) టీమిండియా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ప్రారంభించనుంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, జడేజా టీ20ల్లో రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారథిగా వ్యవహరిస్తారు, వైస్‌ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. ఈ సిరీస్‌తో ప్రముఖ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు.