Page Loader
Virat Kohli : వ‌న్డేల్లో ఫీల్డ‌ర్‌గా కోహ్లీ అరుదైన రికార్డు.. స‌చిన్‌, ద్ర‌విడ్‌ల రికార్డులు బ్రేక్‌.. 
వ‌న్డేల్లో ఫీల్డ‌ర్‌గా కోహ్లీ అరుదైన రికార్డు.. స‌చిన్‌, ద్ర‌విడ్‌ల రికార్డులు బ్రేక్‌..

Virat Kohli : వ‌న్డేల్లో ఫీల్డ‌ర్‌గా కోహ్లీ అరుదైన రికార్డు.. స‌చిన్‌, ద్ర‌విడ్‌ల రికార్డులు బ్రేక్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్‌గా) అందుకున్న భారత ఆటగాడి రికార్డును సమం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జాకీర్ అలీ క్యాచ్‌ను అందుకోవడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 156వ క్యాచ్ కాగా, టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కూడా ఇదే సంఖ్యలో క్యాచ్‌లు అందుకున్నాడు. అజారుద్దీన్ 334 వన్డేల్లో ఈ రికార్డును సాధించగా, కోహ్లీ కేవలం 298 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను చేరుకున్నాడు. వీరి తర్వాత సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు నిలిచారు.

వివరాలు 

వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఫీల్డర్లు: 

మహ్మద్ అజారుద్దీన్ - 156 క్యాచ్‌లు విరాట్ కోహ్లీ - 156 క్యాచ్‌లు సచిన్ టెండూల్కర్ - 140 క్యాచ్‌లు రాహుల్ ద్రవిడ్ - 124 క్యాచ్‌లు సురేశ్ రైనా - 102 క్యాచ్‌లు