LOADING...
Virat Kohli: జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్టుకు లైక్.. మళ్లీ వైరల్ అయిన విరాట్ కోహ్లీ
జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్టుకు లైక్.. మళ్లీ వైరల్ అయిన విరాట్ కోహ్లీ

Virat Kohli: జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్టుకు లైక్.. మళ్లీ వైరల్ అయిన విరాట్ కోహ్లీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఈసారి మాత్రం మైదానంలో ప్రదర్శన వల్ల కాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక చిన్న చర్య కారణంగా. గతంలో ఒక బాలీవుడ్ నటి, ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్టుకు లైక్ కొట్టి వార్తల్లో నిలిచిన కోహ్లీ, ఆ సందర్భంలో వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈసారి జర్మనీకి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ పెట్టిన పోస్టుకు కోహ్లీ లైక్ కొట్టడం చర్చనీయాంశమైంది. దీంతో నెట్టింట ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కోహ్లీ అభిమానులు మాత్రం ఇది మళ్లీ అల్గారిథమ్ లోపం వల్లే జరిగి ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు.

వివరాలు

స్పందించిన చాహల్

మరోవైపు అసలు ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరు? ఆమె పోస్ట్ ఏంటి? అని నెటిజన్లు ఆసక్తిగా వెతుకుతున్నారు. లిజ్లాజ్ జనవరి 30న తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'గోల్డెన్ అవర్ షాట్స్' అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఆ పోస్టుకు కోహ్లీ లైక్ కనిపించడంతో చర్చ మొదలైంది. ఇది ఉద్దేశపూర్వకమా? లేక అనుకోకుండా జరిగిందా? లేక అల్గారిథమ్ కారణమా? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేట్‌గా మారింది. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో చురుకుగా ఉండే యుజేంద్ర చాహల్ ఈ విషయంపై స్పందిస్తూ 'అల్గారిథమ్' అంటూ ఎమోజీతో రిప్లై ఇవ్వడం కూడా ఆసక్తికరంగా మారింది.

వివరాలు

ఇంతకీ లిజ్లాజ్ ఎవరు?

జర్మనీకి చెందిన లిజ్లాజ్ ఎంఎస్సీ సైకాలజీ పూర్తి చేసింది. ఆమె వ్లోగర్‌, సింగర్‌గా కూడా గుర్తింపు పొందింది. తాజాగా ఆర్సీబీకి ఫ్యాన్ అని తెలిపే వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ఇప్పటివరకు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో 274 పోస్టులు పెట్టగా, దాదాపు 4.27 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement