Page Loader
Virat Kohli: 146 ఏళ్ల క్రికెట్‌లో ఏ ఆటగాడికి సాధ్యం కాలేదు.. కానీ విరాట్ కోహ్లీ సాధ్యం చేశాడు! 
146 ఏళ్ల క్రికెట్‌లో ఏ ఆటగాడికి సాధ్యం కాలేదు.. కానీ విరాట్ కోహ్లీ సాధ్యం చేశాడు!

Virat Kohli: 146 ఏళ్ల క్రికెట్‌లో ఏ ఆటగాడికి సాధ్యం కాలేదు.. కానీ విరాట్ కోహ్లీ సాధ్యం చేశాడు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2023
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కొత్త చరిత్రను సృష్టించాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కింగ్ కోహ్లీ 76 పరుగులను చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత ఏడాదిలో 2వేల పరుగులను పూర్తి చేశాడు. ఇంతకుముందు ఆరు క్యాలెండర్ ఇయర్స్‌లో కోహ్లీ 2000 కంటే ఎక్కువ పరుగులను చేశాడు. నిన్నటితో మొత్తం ఏడు క్యాలెండర్ ఇయర్స్ లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 146ఏళ్ల నుంచి నిన్నటి వరకు ఏడు క్యాలెండర్ ఇయర్స్‌లో 2వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు లేడు. దీంతో ఏ దిగ్గజ ఆటగాడికి సాధ్యం కాని ఘనతను కింగ్ కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

Details

ఐదు సార్లు ఆ ఫీట్ ను సాధించిన సచిన్, జయవర్దనే

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే 5 సార్లు మాత్రమే 2 ఈ రికార్డును నెలకొల్పారు. జాక్వెస్ కల్లిస్, రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, మాథ్యూ హేడెన్ 4 సార్లు ఈ ఘనతను సాధించారు. కోహ్లీ ఏయే ఏడాది 2,000 ప్లస్ పరుగులు బాదాడు? 2012లో 2186 పరుగులు 2014లో 2286 పరుగులు 2016లో 2595 పరుగులు 2017లో 2818 పరుగులు 2018లో 2735 పరుగులు 2019లో 2455 పరుగులు 2023లో 2048 పరుగులు