LOADING...
Virat Kohli: కివీస్‌ సిరీస్‌లో భారీ మైలురాయికి చేరువలో విరాట్‌ కోహ్లీ
కివీస్‌ సిరీస్‌లో భారీ మైలురాయికి చేరువలో విరాట్‌ కోహ్లీ

Virat Kohli: కివీస్‌ సిరీస్‌లో భారీ మైలురాయికి చేరువలో విరాట్‌ కోహ్లీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2024
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది టెస్టు ఫార్మాట్‌లో ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతో ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. 2024లో ఇప్పటివరకు ఆరు ఇన్నింగ్స్‌లలో 46 (సౌతాఫ్రికా), 47 (బంగ్లాదేశ్) పరుగులు చేసిన కోహ్లీ, తృటిలో హాఫ్ సెంచరీలను చేజార్చుకున్నాడు. ఇప్పుడు అతడి దృష్టి అక్టోబర్ 16 నుంచి కివీస్‌తో ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్‌పై పడింది. అయితే ఈ సిరీస్‌లో మరో 53 పరుగులు చేసిన కోహ్లీ, టెస్టు క్రికెట్‌లో 9,000 పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. భారత్ తరఫున ఇప్పటివరకు సచిన్ తెందూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గావస్కర్ (10,122) మాత్రమే ఈ ఘనత సాధించారు.

Details

కోహ్లీ కచ్చితంగా రాణిస్తాడు : గౌతమ్ గంభీర్

త్వరలోనే విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వస్తామని కోచ్ గౌతమ్ గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కోహ్లీ పరుగుల ఆకలితో ఉన్నాడని.. అదే అతణ్ని ప్రపంచస్థాయి ఆటగాడిగా మార్చిందని పేర్కొన్నారు. కివీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పరుగులు చేయాలనే తపనతోనే బరిలోకి దిగుతాడని, ఆ తర్వాత అతడు ఆస్ట్రేలియా సిరీస్‌పై దృష్టి పెడతాడని గంభీర్ వివరించాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరులో జరగాల్సిన తొలి టెస్టు మ్యాచ్‌కు వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశముంది.