Virat Kohli: సెట్స్‌లో చెమటోడ్చుతున్న కోహ్లీ.. న్యూజిలాండ్ సీరిస్ టార్గెట్
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాడు. వైట్‌బాల్‌తో నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ తన ఆటకు పదును పెడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ.. కివీస్ సిరీస్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. అతడి సాధనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Details
వన్డేపై గురిపెట్టిన కోహ్లీ
భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఈ పోటీలు ముగిసిన తర్వాత నవంబర్ 4 నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అందుకే రాబోయే సిరీస్ అతడికి మరింత కీలకంగా మారింది.
న్యూజిలాండ్‌కు ఇంకా బయలుదేరకముందే స్వదేశంలో ప్రాక్టీస్ మొదలుపెట్టడం అతడి ప్రపంచకప్ లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది.
Details
ప్రపంచకప్ జట్టులో చోటుపై ఆసక్తి
2027 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కుతుందా? అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో చర్చకు వస్తోంది.
వయసు, ఫామ్, ఫిట్‌నెస్ అంశాల నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ వారి ప్రదర్శనకు కీలక పరీక్షగా మారనుంది.
ఈ అంశంపై న్యూజిలాండ్ సహాయ కోచ్ జేమ్స్ పామెంట్ స్పందిస్తూ.. కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజ ఆటగాళ్ల కెరీర్ చివరి దశలో వారి భవిష్యత్తుపై చర్చ జరగడం సహజమని పేర్కొన్నాడు.
అయితే ,ప్రస్తుతం కోహ్లీ దృష్టి మాత్రం చర్చలపై కాదు.. బ్యాటింగ్ సాధనపైనే ఉంది. కివీస్ సిరీస్‌లో అతడి ఆటతీరు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్స్‌లో చెమటోడుస్తున్న కోహ్లీ.. వీడియో వైరల్
Look who's back, hitting the nets! 😍#ViratKohli is bringing the intensity ahead of the next challenge! 💪#NZvIND #INDvNZ #TeamIndia pic.twitter.com/wb8ZkdYVbC
— Star Sports (@StarSportsIndia) October 25, 2026