
Virat Kohli: విరాట్ కోహ్లీ మరో మైలురాయి.. టీ20 కెరీర్‌లో అద్భుత ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. 2008లో ఆరంభమైన ఈ మెగా లీగ్ ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది.
తొలుత 8 జట్లతో ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్తుతం 10 జట్లతో మరింత ఆకర్షణగా కొనసాగుతోంది. 2025 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడ్డాయి.
ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 400వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ, అరుదైన రికార్డు సాధించాడు.
ఈ జాబితాలో ఇప్పటికే రోహిత్ శర్మ (448 మ్యాచ్‌లు), దినేష్ కార్తీక్ (412 మ్యాచ్‌లు) ఉండగా ఇప్పుడు విరాట్ మూడో స్థానంలో నిలిచాడు.
Details
డాన్స్ చేసిన విరాట్, షారుక్
2008లో టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 382 ఇన్నింగ్స్‌లో 41.43 సగటుతో 12,886 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 97 అర్ధ సెంచరీలు సాధించాడు.
భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ ఒకడిగా నిలిచాడు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
వేదికపై బాలీవుడ్ స్టార్ కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీతో కలిసి షారుఖ్ ఖాన్ స్టెప్పులేశారు. వీరద్దరి డాన్స్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.