Page Loader
Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు
ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు

Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
09:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ చరిత్రలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఘనతను సాధించాడు. అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పటివరకు ఈ ఘనత శిఖర్ ధావన్‌ పేరిట ఉండగా.. ఆ రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 770 ఫోర్లు బాదిన విరాట్.. టోర్నీ హిస్టరీలో టాప్‌ ప్లేస్‌లోకి ఎగబాకాడు. శిఖర్‌ ధావన్‌ 768 ఫోర్లతో రెండో స్థానంలో ఉండగా, డేవిడ్ వార్నర్‌ (663), రోహిత్ శర్మ (640), అజింక్య రహానె (514) తదుపరి స్థానాల్లో ఉన్నారు. ఈ రోజు జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ ఎంతో ఉత్కంఠగా మారింది.

Details

పంజాబ్ గెలుపునకు 191 పరుగులు అవసరం

అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, జెమ్సన్ తలా మూడు వికెట్లు తీశారు. పంజాబ్ కింగ్స్ గెలవాలంటే 191 పరుగులు చేయాలి.