Page Loader
Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త రికార్డు.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా రికార్డు!
విరాట్ కోహ్లీ కొత్త రికార్డు.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా రికార్డు!

Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త రికార్డు.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2024
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడో టెస్టు వర్షం కారణంగా తొలి రోజు కేవలం 13.2 ఓవర్‌ల ఆట మాత్రమే కొనసాగింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు మెక్‌స్వీనీ(4 నాటౌట్), ఉస్మాన్ ఖావాజా(19 నాటౌట్) ఉన్నారు. ఈ మ్యాచ్‌తో భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాపై 100 మ్యాచ్‌లు ఆడిన రెండో భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లి బ్రిస్బేన్ టెస్టులో మైదానంలో అడుగుపెట్టిన వెంటనే ఈ ప్రత్యేకతను సాధించాడు. ఇప్పటి వరకు, కోహ్లీ ఆస్ట్రేలియాపై 28 టెస్టులు, 49 వన్డేలు, 23 టీ20లు ఆడాడు.

Details

ఆస్ట్రేలియాపై 17 సెంచరీలు

సచిన్, తన కెరీర్‌లో ఆసీస్‌పై 39 టెస్టులు, 71 వన్డేలతో 110 మ్యాచ్‌లు ఆడాడు. ఇక కోహ్లీ మరో 11 మ్యాచ్‌లు ఆడితే సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేయనున్నాడు. మొత్తం 100 మ్యాచ్‌లలో 50.24 సగటుతో 5326 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలున్నాయి. ఆస్ట్రేలియాపై అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు 1.సచిన్ టెండూల్కర్ (భారత్) 110 మ్యాచ్‌లు 2. విరాట్ కోహ్లి (భారత్) - 100 మ్యాచ్‌లు 3. డెస్మండ్ లియో హేన్స్ (వెస్టిండీస్) - 97 మ్యాచ్‌లు 4. మహేంద్ర సింగ్ ధోని (భారత్) - 91 మ్యాచ్‌లు 5. వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్) - 88 మ్యాచ్‌లు 6. జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) - 82 మ్యాచ్‌లు