Virat Kohli: విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియో వైరల్
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలను తయారు పరిపాటిగా మారింది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా డీప్‌ఫేక్ వీడియోల బాధితుడిగా మారాడు. విరాట్ కోహ్లీ నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు.. సైబర్ నేరగాళ్లు ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి వీడియోను రూపొందించారు. ఇందులో విరాట్ కోహ్లీ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రేక్షకులను మరింత నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు ఈ వీడియోను ఓ హిందీ ఛానెల్‌లో ప్రసారం అవుతున్నట్లు దాన్ని క్రియేట్ చేశారు.
సచిన్ కూడా డీప్ ఫేక్ బాధితుడే
విరాట్ కోహ్లీకి ముందు సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో వైరల్ అయ్యింది. డబ్బు సంపాదించే ప్లాట్‌ఫారమ్‌ను సచిన్ ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించేలా సైబర్ నేరగాళ్లు దాన్ని రూపొందించారు. అయితే ఈ వీడియోపై స్పందించిన సచిన్.. ఈ వీడియో ఫేక్ అని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సచిన్ కూమార్తె సారా తెందూల్కర్ కూడా డీప్‌ఫేక్ బాధితురాలే కాడవం గమనార్హం. ఆమె డీప్ ఫేక్ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అంతకుముదు, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే, డీప్‌ఫేక్ వీడియోలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందుకోసం కొత్త చట్టం తీసుకొస్తామని కేంద్రం ఇప్పటికే ప్రటించింది.