Page Loader
Virat Kohli: పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న విరాట్.. సింగిల్‌ డిజిట్‌కే ఔట్ 
పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న విరాట్.. సింగిల్‌ డిజిట్‌కే ఔట్

Virat Kohli: పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న విరాట్.. సింగిల్‌ డిజిట్‌కే ఔట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్‌ను చూసేందుకు ఆసక్తిగా ఉన్న అభిమానులకు ఆ సంబరం నిరాశను కలిగించింది. రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ తరఫున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (6) సింగిల్ డిజిట్ స్కోరుతో పెవిలియన్ చేరాడు. రైల్వేస్ బౌలర్ సంగ్వాన్‌ బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్‌ ఎగిరిపడింది. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతిని ఎదురుకోడంలో విఫలమైన కోహ్లీ వికెట్‌ను సమర్పించాడు. దీనితో, దేశవాళీ క్రికెట్ బరిలో విఫలమైన స్టార్ బ్యాటర్ల తాజా జాబితాలో కోహ్లీ కూడా చేరిపోయాడు. ఇంతకుముందు రౌండ్ మ్యాచుల్లో,రిషభ్‌ పంత్, రోహిత్ శర్మ,యశస్వి జైస్వాల్ వంటి బ్యాటర్లు కూడా పరుగులు సాధించలేకపోయారు. విరాట్ బ్యాటింగ్‌ను ఆస్వాదించడానికి వచ్చిన అభిమానులు అతడు పెవిలియన్‌కు చేరగానే నిరాశకు గురయ్యారు.

వివరాలు 

కోహ్లీపై హర్భజన్‌ సింగ్‌ ప్రశంసలు

ప్రస్తుతం దిల్లీ 31 ఓవర్లలో 4 వికెట్ల నష్టంతో 104 పరుగులు చేసింది. రైల్వేస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ రంజీ బరిలోకి దిగడంపై హర్భజన్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించాడు.అయితే, కోహ్లీకి పరుగులు చేయాలంటే ఓపిక పట్టాలని సూచించాడు. తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఔటైనప్పటికీ, కోహ్లీని తక్కువగా అంచనా వేయొద్దని భజ్జీ పేర్కొన్నాడు.

వివరాలు 

 మూడు లేదా నాలుగు గంటల పాటు క్రీజ్‌లోనే.. 

''విరాట్ కోహ్లీ యువకులకు రోల్‌మోడల్.నేనే విరాట్‌గా ఉంటే ఆటను ఆస్వాదించడం పైనే దృష్టి సారిస్తాను.ఎప్పుడైతే మనం ఆటను ఎంజాయ్‌ చేస్తామో,మన ప్రదర్శన కూడా అత్యుత్తమంగా ఉంటుంది. కానీ విరాట్ స్థాయికి మనం చేరుకుంటే ఒత్తిడితోపాటు అంచనాలు ఎక్కువవుతాయి. అప్పుడు ఆటను ఆస్వాదించడమనేది వెనక సీట్‌లోకి వెళ్లిపోతుంది.కానీ,నేను మాత్రం విరాట్‌ ఆటను ఆస్వాదించాలని చెబుతాను.ఎలా ఆడాలి,ఎలా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలో కుర్రాళ్లకు చెప్పాలి. విరాట్ కోహ్లీ ఎక్కువ పరుగులు చేయాలంటే నేను చెప్పే ఒకే సూత్రం: క్రీజ్‌లో పాతుకుపోవాలి. కనీసం మూడు లేదా నాలుగు గంటల పాటు క్రీజ్‌లోనే ఉండాలి. అప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా చేస్తే పరుగులు వచ్చేస్తాయి. తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఔటైనా కంగారు అవసరం లేదు'' అని భజ్జీ చెప్పాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆఫ్‌స్టంప్‌ ఎగిరిపడింది..