Page Loader
Virat Kohli: సరికొత్త రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4 వేల రన్స్ పూర్తి
సరికొత్త రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4 వేల రన్స్ పూర్తి

Virat Kohli: సరికొత్త రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4 వేల రన్స్ పూర్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2025
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డు సృష్టించారు.అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచారు. రెండో స్థానంలో ఉన్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 3,990పరుగులు చేశారు.ఇప్పటి వరకు మొత్తం 545అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 27,000కి పైగా పరుగులు నమోదు చేశారు. మ్యాచ్ విషయానికి వస్తే...55 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సర్ సహాయంతో 52పరుగులు చేసిన కోహ్లీ 19వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు... ఓపెనర్ రోహిత్ శర్మ(1)మరోసారి నిరాశపరిచాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4 వేల రన్స్ పూర్తి