Page Loader
రికార్డులను వేటాడేందుకు సై అంటున్న కింగ్ కోహ్లీ
శ్రీలంకతో జరిగిన 3 వన్డేల్లో రెండు సెంచరీలు చేసిన కోహ్లీ

రికార్డులను వేటాడేందుకు సై అంటున్న కింగ్ కోహ్లీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2023
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ సెంచరీలతో చరిత్రను తిరగరాశాడు. స్వదేశంలో వన్డే ఫార్మాట్‌లో 21 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక వన్డే సెంచరీల జాబితాలో సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో పలు రికార్డులపై కింగ్ కోహ్లీ కన్నేశాడు. న్యూజిలాండ్ కింగ్ కోహ్లికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. కివీస్‌పై 26 మ్యాచ్‌ల్లో 59.91 సగటుతో మొత్తం 1378 పరుగులు చేశాడు. 94.64 స్ట్రైకింగ్ రేటుతో 5 సెంచరీలు, 8 అర్ధసెంచరీలు చేశాడు.

విరాట్ కోహ్లీ

సచిన్ రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన రికీ పాంటింగ్ , వీరేంద్ర సెహ్వాగ్‌ల రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీ కేవలం 1 సెంచరీ దూరంలో ఉన్నాడు. రికీ పాంటింగ్ 51 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు, వీరేంద్ర సెహ్వాగ్ 23 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు, జయసూర్య 47 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, విరాట్ కోహ్లీ 26 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు చేశారు. సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డుకు కేవలం 4 సెంచరీల దూరంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు