Page Loader
Virat Kohli: ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ తప్పకుండా రాణిస్తాడు : ఏబీ డివిలియర్స్
ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ తప్పకుండా రాణిస్తాడు : ఏబీ డివిలియర్స్

Virat Kohli: ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ తప్పకుండా రాణిస్తాడు : ఏబీ డివిలియర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings)పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ తొలి ఫైనలిస్ట్‌గా నిలిచింది. పంజాబ్‌ నిరాశాజనక ప్రదర్శన మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. వారి బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఎవరూ ఇవ్వలేదు. ఆర్సీబీ బౌలర్లు విజృంభించడంతో పంజాబ్ బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు.

Details

కోహ్లీపై ఏబీ డివిలియర్స్‌ ఆశాభావం

ఛేదనకు దిగిన ఆర్సీబీ 10 ఓవర్లలోనే 2 వికెట్లు నష్టపోయి 106 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే అభిమానులు ఆశించిన విధంగా స్టార్ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ కేవలం 12 పరుగులకే వెనుదిరగడం కొంత నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌లో విఫలమైనా, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ మాత్రం విరాట్‌ కోహ్లీపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో పరుగులు చేయలేకపోయాడు. కానీ నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను, ఫైనల్‌ మ్యాచ్‌లో అతడు కీలక ఇన్నింగ్స్‌ ఆడతాడు. అతని ఆటను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానని డివిలియర్స్‌ వ్యాఖ్యానించాడు.

Details

ఫైనల్‌ మ్యాచ్‌పై విశ్లేషణ

ఆర్సీబీ గతంలో కూడా టైటిల్‌ గెలిచే అవకాశం దక్కించుకున్న సందర్భాలున్నాయని గుర్తు చేసిన డివిలియర్స్‌, ''2011లో గొప్ప అవకాశం ఉండేది, 2016 గురించి ఇప్పటికీ మాట్లాడతారు. కానీ ఇప్పుడు 2025లో ఆర్సీబీ ఫైనల్‌కి చేరింది. జూన్‌ 3న జరగబోయే తుదిపోరులో ఈసారి ట్రోఫీ ఆర్సీబీదే అవుతుంది,'' అని ధీమాగా చెప్పారు. హేజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ ప్రభావం RCB బౌలింగ్‌ యూనిట్‌ బలంగా మారిందని కూడా డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. ''జోష్‌ హేజిల్‌వుడ్‌ రాకతో బౌలింగ్‌ విభాగం పటిష్టమైంది. అతడు కీలక ఆటగాడు. అలాగే భువనేశ్వర్‌ కుమార్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడని వివరించారు.