Loading...
Monty Panesar: కోహ్లీ రిటైర్మెంట్‌పై మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు..
కోహ్లీ రిటైర్మెంట్‌పై మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు..

Monty Panesar: కోహ్లీ రిటైర్మెంట్‌పై మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భవిష్యత్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ తనకు చివరి వరల్డ్‌కప్ అని కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఆ టోర్నీ ముగిసిన వెంటనే అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని తాను భావించడం లేదని పనేసర్ పేర్కొన్నాడు. ఇటీవల వన్డే క్రికెట్‌లో కోహ్లీ 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడి ఆటతీరును పనేసర్ ప్రశంసించాడు. కోహ్లీలో ఇప్పటికీ పరుగులు సాధించాలనే తపన, ఆటపై ఉన్న తీవ్రత, ఫిట్‌నెస్‌పై చూపిస్తున్న శ్రద్ధ తనను ఆకట్టుకుంటున్నాయని చెప్పాడు. కోహ్లీ శిక్షణ తీసుకునే విధానం చూస్తే తాను కూడా జిమ్‌కు వెళ్లాలనిపిస్తుందని సరదాగా పేర్కొన్నాడు.

వివరాలు 

కోహ్లీ కూడా ప్రస్తుతం అదే విధంగా ఆడుతున్నాడు: పనేసర్

కోహ్లీ ప్రతి మ్యాచ్‌ను ఎంతో సీరియస్‌గా తీసుకుంటున్నాడని పనేసర్ చెప్పాడు.

సాధారణంగా కెరీర్‌లో 10-15మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయని భావించినప్పుడు ప్రతి మ్యాచ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని,ప్రస్తుతం కోహ్లీ కూడా అదే మైండ్‌సెట్‌తో ఆడుతున్నాడని వివరించాడు.

"విరాట్‌లో ఇప్పటికీ పరుగులు చేయాలనే ఆకలి చాలా ఉంది.ప్రతి మ్యాచ్‌ను ఎంతో తీవ్రతతో ఆడుతున్నాడు.ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు.తన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రోత్సహిస్తున్నాడు.కెరీర్‌లో 10-15మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయని భావిస్తే ప్రతి మ్యాచ్‌ను ప్రత్యేకంగా చూస్తాం.కోహ్లీ కూడా ప్రస్తుతం అదే విధంగా ఆడుతున్నాడు.ప్రతి బంతికి తన వంద శాతం కృషి చేస్తున్నాడు.అందుకే 2027 ప్రపంచకప్ తర్వాత అతడు రిటైర్ అవుతాడని నాకు అనిపించడం లేదు.అతడి నుంచి ఇంకా చాలా క్రికెట్ చూడొచ్చు"అని పనేసర్ పేర్కొన్నాడు.

వివరాలు 

రోహిత్ శర్మపైనా పనేసర్ కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా, టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపైనా పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ గొప్ప ఆటగాడని, అతడికి ప్రపంచకప్ జట్టులో అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డాడు.

రోహిత్ క్రీజులో నిలదొక్కుకుంటే ప్రత్యర్థి బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొని భారీగా పరుగులు చేయగల సామర్థ్యం అతడికి ఉందని చెప్పాడు.

"రోహిత్ అద్భుతమైన ఆటగాడు. అతడు ఫామ్‌లోకి వస్తే తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేయగలడు. భారత్‌కు రోహిత్ లాంటి నాణ్యమైన ఆటగాడు అవసరం" అని మాంటీ పనేసర్ పేర్కొన్నాడు.

ADVERTISEMENT