Asian Games 2023: సెయిలింగ్‌లో కాంస్యం గెలిచిన విష్షు శరవణస్
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది. మెన్స్ డింగీ ILCA-7 ఈవెంట్లో 24 ఏళ్ల భారత సెయిలర్ విష్ణు శరవణన్ 34 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. సింగపూర్ సెయిలర్‌లో జున్ హాన్ ర్యాన్ గోల్డ్ మెడల్, దక్షిణకొరియా సెయిలర్ జీమిన్ రజతం సొంతం చేసుకున్నారు. అంతకుముందు మంగళవారం ఉదయం భారత్‌కు చెందిన 17 ఏళ్ల సెయిలర్ నేహా థాకూర్ ఐఎల్‌సీఏ-4 ఈవెంట్‌లో 32 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే.
కాంస్య పతకాన్ని దక్కించుకున్న ఇబాద్ అలీ
ఆ ఈవెంట్లో థాయిలాండ్ కు చెందిన కన్బూంజన్ స్వర్ణ పతకం నెగ్గగా, సింగపూర్‌కు చెందిన కీరా మేరీ కార్లైల్ కాంస్య పతకంలో సరిపెట్టుకున్నాడు. అదే విధంగా మెన్స్ విండ్ సర్ఫర్ ఈవెంట్‌లో మరో సెయిలర్ ఇబాద్ అలీ పతకంతో మెరిశాడు. రేసులో 52 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.