ఆసియా క్రీడలకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
వచ్చే నాలుగు నెలల్లో వరుస టోర్నీలతో టీమిండియా బిజీబిజీగా గడపనుంది. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు ఉంది. వెస్టిండీస్ సిరీస్ ముగిసిన వెంటనే ఐర్లాండ్ టూర్‌కు టీమిండియాకు వెళ్లనుంది. ఈ టూరులో మూడు టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఈ సిరీస్ కి హెడ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. ఇక ఐర్లాండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంకలో ఆసియా కప్ 2023 మ్యాచులను టీమిండియా ఆడనుంది. అయితే ఆ టోర్నీకి రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్ గా ఉంటాడు. ఆసియా కప్ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని ఓ జట్టు ఆసియా క్రీడల కోసం చైనాకి వెళ్లనుంది. మరో జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది.
రాహుల్ ద్రావిడ్ తర్వాత హెడ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్
అయితే చైనాకి వెళ్లే భారత పురుషుల జట్టుకి వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. మరోవైపు భారత మహిళల జట్టుకి హెడ్ కోచ్‌గా హృషికేశ్ కరిత్కర్ తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళా, పురుషుల జట్టుకి వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇక వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు గడువు ముగియనుంది. దీంతో రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మన్ వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.