Page Loader
Rahu Dravid: టీమిండియా హెడ్ కోచ్‌ పదవికి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై.. కొత్త కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? 
టీమిండియా హెడ్ కోచ్‌ పదవికి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై.. కొత్త కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..?

Rahu Dravid: టీమిండియా హెడ్ కోచ్‌ పదవికి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై.. కొత్త కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2023
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా హెడ్ కోచ్‌(Head Coach)గా రాహుల్ ద్రావిడ్ (Rahu Dravid) పదవికాలం వరల్డ్ కప్ 2023 ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. 2021 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ రెండేళ్ల పాటు పదవిలో ఉన్నాడు. ఇక వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఘోర ఓటమి నేపథ్యంలో ద్రావిడ్ హెడ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం ఇంకా ద్రావిడ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ద్రావిడ్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే భారత జట్టు హెడ్ కోచ్‌గా ప్రస్తుత NCA చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Details

గతంలో హెడ్ కోచ్ గా సేవలందించిన వీవీఎస్ లక్ష్మణ్

ద్రావిడ్ మళ్లీ హెడ్ కోచ్ పదవిలో కొనసాగించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలస్తోంది. దీంతో లక్ష్మణ్‌ను పూర్తిస్థాయి కోచ్‌గా నియమించాలని BCCI భావిస్తోంది. ద్రావిడ్ గైర్హాజరీతో లక్ష్మణ్ పలు సిరీస్‌ల్లో టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారత జట్టుకు, అండర్-19 జట్లకూ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా సేవలందించారు. ఇదిలా ఉండగా.. ఇవాళ వైజాగ్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.