Indian Womens Cricket : 1983 క్షణం కోసం వెయింటింగ్.. రికార్డులు తిరగరాసిన భారత మహిళా జట్టు!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్‌లో ఆస్ట్రేలియా అంటేనే అప్రతిహత శక్తిగా భావిస్తారు. అలాంటి బలమైన ఆస్ట్రేలియా మహిళా జట్టు వరల్డ్‌కప్‌ల్లో సాధించిన 15 వరుస విజయాల పరంపరను భారత మహిళా జట్టు చారిత్రకంగా ముగించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, భారత్ మహిళల ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మహిళల క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదనగా నిలిచింది. ఈ ఘనతతో భారత్ ఫైనల్ బరిలో అడుగుపెట్టింది. ఈ విజయం కేవలం సెమీ ఫైనల్ విజయమే కాకుండా, భారత మహిళా క్రికెట్‌కు ఒక 1983 మొమెంట్ లా నిలిచిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Details
రాణిచిన జెమీయా రోడ్రిగ్స్
2023 నవంబర్ 19న పురుషుల జట్టు ఆస్ట్రేలియాకు ఓటమి చెందడంతో నిరాశ చెందిన అభిమానులకు ఈ గెలుపు గొప్ప ఊరటను ఇచ్చింది. భారత జట్టు ఇంతకుముందు వరల్డ్‌కప్ నాకౌట్ దశలో 200 పరుగులకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఎప్పుడూ చేధించలేదు. కానీ ఈసారి జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్ అద్భుత ప్రదర్శనతో ఆ పరంపరను చెరిపేశారు. భారీ లక్ష్యం ఉన్నప్పటికీ, హర్మన్‌ప్రీత్, జెమీమా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి, ఒత్తిడిని తట్టుకుని విజయ దిశగా జట్టును నడిపించారు. భారత బౌలర్లు కూడా కీలకంగా రాణించారు. రేణుక సింగ్, శ్రీ చరణి, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్‌ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా ఆస్ట్రేలియా 350 పరుగుల లోపులోనే నిలిచిపోయింది.
Details
మహిళా క్రికెట్ చరిత్రలో గొప్ప మలుపు
దీంతో ఆస్ట్రేలియా బలమైన బ్యాటింగ్ లైనప్‌ను భారత్ సమర్థంగా నియంత్రించగలిగింది. ఈ విజయం మహిళా క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మలుపుగా నిలిచింది. ఇంతవరకు ఫైనల్‌లలో తడబడే జట్టుగా పేరుపొందిన భారత్, 300+ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి 'చోకర్స్' అనే ముద్రను చెరిపేసుకుంది. ఇప్పుడు ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడబోతున్న భారత్, ఈ విజయాన్ని మరింత గౌరవప్రదంగా మార్చుకోవాలని చూస్తోంది. సెమీ ఫైనల్‌లో 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కేవలం ఒక విజయం కాదు. భారత మహిళా క్రికెట్‌లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, కొత్త యుగానికి నాంది అని చెప్పవచ్చు.