LOADING...
Ravichandran Ashwin: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నా, కానీ సాధ్యం కాలేదు.. రవిచంద్రన్ అశ్విన్‌
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నా, కానీ సాధ్యం కాలేదు.. రవిచంద్రన్ అశ్విన్‌

Ravichandran Ashwin: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నా, కానీ సాధ్యం కాలేదు.. రవిచంద్రన్ అశ్విన్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2024
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్‌ తన అద్భుతమైన ప్రదర్శనలతో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. టెస్టుల్లో భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా అనిల్ కుంబ్లే తర్వాత రెండో స్థానంలో నిలిచిన అశ్విన్‌ (516 వికెట్లు) నిలిచాడు. బౌలింగ్‌లో మాత్రమే కాకుండా, అప్పుడప్పుడు బ్యాటింగ్‌లోనూ అశ్విన్‌ మెరిశాడు. ఓ కార్యక్రమానికి హాజరైన అశ్విన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను ఒకప్పుడు ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, కానీ ఆ రికార్డును సాధించలేకపోయానని పేర్కొన్నాడు.

Details

అశ్విన్ కు శుభాకాంక్షల వెల్లువ

ఇవాళ అశ్విన్‌ 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ కూడా అశ్విన్‌కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపింది. ఇప్పటి వరకు 281 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 744 వికెట్లు సాధించిన అశ్విన్‌ టెస్టుల్లో 36 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అలాగే బ్యాటర్‌గా ఐదు సెంచరీలు నమోదు చేశాడు. వన్డే క్రికెట్‌కు కొంతకాలంగా దూరంగా ఉన్నా అశ్విన్, ఇప్పుడు టెస్టుల్లో భారత జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్టులో అశ్విన్‌ పాల్గొనబోతున్నాడు.