ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ బీసీసీఐ ఈవెంట్ లా ఉందని మిక్కీ ఆర్థర్ వ్యాఖ్యలు.. ఫైర్ అయిన వసీం అక్రమ్
వన్డే ప్రపంచ కప్ 2023 లో భాగంగా అక్టోబర్ 14వ తేదీ రోజున భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో 7వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై భారత్ విజయ ఢంకా మోగించింది. అయితే ఈ మ్యాచ్ గురించి పాకిస్తాన్ టీం డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్, ఐసీసీ ఈవెంట్ లా కాకుండా బీసీసీఐ జరిపిన ఈవెంటులా ఉందని మైదానంలో ఎక్కడ దిల్ దిల్ పాకిస్తాన్ అనే నినాదం వినిపించలేదని మిక్కీ ఆర్థర్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమం ఫైర్ అయ్యారు.
అవసరం లేని విషయాల గురించి మాట్లాడొద్దని వసీం అక్రమ్ ఫైర్
మిక్కీ ఆర్డర్ అలాంటి వ్యాఖ్యలు చేయవలసిన అవసరం లేదని, పాకిస్తాన్ ఆటగాళ్ల ఆట తీరు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని వసీం అక్రమ్ అన్నారు. అంతేకాదు, మిస్టరీ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ ను ఎలా ఎదుర్కొంటారు? ముందుగా ఆ విషయాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని, అంతేగాని అనవసర విషయాలపైకి దృష్టి మరల్చాల్సిన అవసరం అస్సలు లేదని వసీం అక్రమ్ అన్నారు. వసీం అక్రమ్ తో పాటుగా మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాకిస్తాన్ ఆటగాళ్ల ఆట తీరు గురించి మాట్లాడాల్సింది పోయి అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని మొయిన్ ఖాన్ అన్నారు.