Babar Azam : నాన్ స్ట్రైకర్ కొట్టిన బంతిని ఆపాలని చూసిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కోసం కంగారూల గడ్డపై పాకిస్థాన్ క్రికెట్ (Pakistan Cricket) జట్టు కాలు మోపింది. డిసెంబర్ నుంచి 14 నుంచి పెర్త్‌లో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబార్ అజామ్ (Babar Azam) తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్థాన్ ఇప్పటివరకూ టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ఇప్పుడు కొత్త కెప్టెన్ షాన్ మసూద్ నేతృత్వంలో చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాక్ ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్‌తో పాక్ తలపడనుంది. ఈ మ్యాచులో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పాక్ క్రికెట్ జట్టులో చాలా మార్పులు
బ్యూ వెబ్‌స్టర్ వేసిన బంతిని షాన్ మసూద్ కొట్టాడు. బంతి నాన్-స్ట్రైకర్ బాబర్‌ను దాటి వెళ్లడంతో అతను దానిని తన చేతులతో ఆపాలని ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టులో చాలా మార్పులు జరిగాయి. షాహీన్ షా అఫ్రిది టీ20 కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, షాన్ మసూద్ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.