
WC ఆఫ్గాన్‌తో మ్యాచ్: రోహిత్ శర్మ బద్దలు కొట్టిన రికార్డులివే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన సత్తా ఏంటో మరోసారి చూపాడు.
అలవోకగా సిక్సర్లు, ఫోర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. దిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచులో హిట్ మ్యాన్ 84 బంతుల్లో 131 పరుగులు చేసి ఆఫ్గాన్ బౌలర్లను రఫ్పాడించాడు.
ఈ క్రమంలో రోహిత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
వన్డే ప్రపంచ కప్ టోర్నీలో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల సాధించిన ఆటగాడిగా హిట్ మ్యాన్ చరిత్రకెక్కాడు.
కేవలం 19 ఇన్నింగ్స్‌లోనే వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
Details
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ
రోహిత్ నమోదు చేసిన సంచలన రికార్డులు ఇవే
వన్డేల్లో అత్యధిక సెంచరీలు(31) నమోదు చేసిన మూడో బ్యాటర్
వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు (7)
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు (556)
భారత్ తరుఫున వన్డే వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (63-100)