సమిష్టి నిర్ణయంతోనే రాయుడిని తప్పించాం.. నా తప్పు లేదు : ఎమ్మెస్కే
ఈ వార్తాకథనం ఏంటి
చైన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటిరాయుడు వ్యవహారం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలను పుట్టిస్తోంది. 2019వన్డే వరల్డ్ కప్ లో రాయుడిని ఎంపిక చేయని విషయం తెలిసిందే.ధావన్ గాయపడటంతో అతని స్థానంలో రాయుడిని ఎంపిక చేయడకపోవడంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది.
తనను భారత జట్టుకు ఎంపిక చేయకపోవడం వెనుక ఎమ్మెస్కే హస్తం ఉందని, ఆయన కక్షగట్టి తనను వన్డే వరల్డ్ కప్ జట్టులోకి రాకుండా అడ్డుకున్నాడని ఇటీవల అంబటి రాయుడు తీవ్ర ఆరోపణలు చేశాడు.
తాజాగా రాయుడు వ్యాఖ్యాలపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే కౌంటర్ ఇచ్చాడు.
Details
ఒక్కడి నిర్ణయం ఫైనల్ కాదు
సెలెక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారని అందరికి తెలుసనని, కెప్టెన్ కూడా సమావేశాలకు హజరవుతాడని, ఇది ఒక్కడి నిర్ణయం కాదని, తాను ఏదైనా ప్రతిపాదించినా దానికి అందరి ఆమోదయోగ్యం అవసరం ఉంటుందని, వ్యక్తిగత నిర్ణయాలు, ఒకరిమీద పగతో నిర్ణయాలను తీసుకోమని ఎమ్మెస్కే వెల్లడించారు.
2029 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా నాలుగో స్థానంలో అంబటిరాయుడు నిలదొక్కుకున్నాడు. మెగా టోర్నీకి అతని ఎంపిక ఖాయమని భావించారు.
చివరికి సెలక్టర్లు రాయుడిని కాదని ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌కు చోటు కల్పించారు. ఆ వరల్డ్ కప్‌లో నాలుగో స్థానంలో సరైన బ్యాటర్ లేకపోవడంతో టీమిండియా ఓడిపోయింది.