LOADING...
Harmanpreet Kaur: ప్లాన్ ప్రకారమే ఆడాం.. ముంబై విజయంపై హర్మన్‌ప్రీత్ కీలక వ్యాఖ్యలు
ప్లాన్ ప్రకారమే ఆడాం.. ముంబై విజయంపై హర్మన్‌ప్రీత్ కీలక వ్యాఖ్యలు

Harmanpreet Kaur: ప్లాన్ ప్రకారమే ఆడాం.. ముంబై విజయంపై హర్మన్‌ప్రీత్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ మ్యాచ్‌ తమకు ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అన్నారు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ప్రదర్శించిన ఆటపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, ఆటగాళ్ల మైండ్‌సెట్‌ నుంచి అమలు చేసిన ప్రణాళికల వరకు అన్నీ సమర్థవంతంగా సాగాయని పేర్కొన్నారు. 'ఈ రోజు మేము ఆడిన తీరు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. గత మ్యాచ్‌లో పరిస్థితులు మనకు అనుకూలంగా లేక తీవ్ర నిరాశకు గురయ్యాం. కానీ ఈసారి మరింత బలమైన మైండ్‌సెట్‌తో బరిలోకి దిగాం. ముందుగా వేసుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేశామని హర్మన్‌ప్రీత్‌ తెలిపారు.

Details

50 పరుగుల తేడాతో గెలుపు

డబ్ల్యూపీఎల్‌-4లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంలో హర్మన్‌ప్రీత్‌ (74 నాటౌట్‌; 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక పాత్ర పోషించడంతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్నారు. తన వ్యక్తిగత ప్రదర్శనపై స్పందించిన హర్మన్‌ప్రీత్‌.. 'గత మ్యాచ్‌లో కూడా నాకు మంచి ఆరంభం లభించింది. కానీ దాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాను. ఈ రోజు బ్యాటింగ్‌కు వెళ్లేముందు నాతోనే మాట్లాడుకున్నాను. నిన్నటి విషయాలను పక్కన పెట్టి, ఇది కొత్త రోజు, కొత్త ఇన్నింగ్స్‌ అనే ఆలోచనతో మైదానంలోకి దిగాను' అని చెప్పారు.

Details

ముంబై ఇండియన్స్ కి బలమైన బ్యాటింగ్ లైనప్

తన బ్యాటింగ్‌కు పూర్తి క్రెడిట్‌ను భారత జట్టు అనుభవానికి, ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌లో ఉన్న బలమైన బ్యాటింగ్‌ లైనప్‌కే ఇస్తానని పేర్కొన్నారు. జట్టులో లోతైన బ్యాటింగ్‌ ఉండటం వల్ల స్వేచ్ఛగా ఆడగలిగానని తెలిపారు. గత మ్యాచ్‌ను గుర్తు చేస్తూ, చివరి దశలో ఒక్క మంచి బంతి వేసి ఉంటే ఫలితం మారి ఉండేదని, అది దురదృష్టవశాత్తు జరగలేదని అన్నారు. అయినప్పటికీ చివరి వరకు మ్యాచ్‌లోనే నిలబడ్డామని, అదే ఈ మ్యాచ్‌లో మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని హర్మన్‌ప్రీత్‌ చెప్పారు.

Advertisement

Details

ఆత్మవిశ్వాసం వల్లే గెలిచాం

'నిన్న సరిగా ఆడకపోయినా మ్యాచ్‌లో నిలిచామంటే అది నమ్మకం, ఆత్మవిశ్వాసం వల్లే' అని స్పష్టం చేశారు. టీ20 క్రికెట్‌లో ప్రత్యర్థిని పూర్తిగా కట్టడి చేస్తూ 10 వికెట్లు పడగొట్టడం ఒక సారథిగా ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. 'నిజం చెప్పాలంటే ప్రతి వికెట్‌ నాకు ఆనందం ఇచ్చింది. టీ20లో జట్టు 10 వికెట్లు తీస్తే.. ఓ కెప్టెన్‌గా అంతకంటే ఎక్కువగా ఏమీ కోరలేను. మా ఫీల్డింగ్‌ ప్రదర్శనపై కూడా నేను చాలా సంతోషంగా ఉన్నానంటూ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement