MI: 'ఇషాన్‌ను మిస్ అవుతాం'.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హార్థిక్ పాండ్యా
ముంబయి ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన ఇషాన్ కిషన్, ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు మారాడు. దీనిపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్థిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్‌ను కచ్చితంగా మిస్ అవుతామని పాండ్యా వెల్లడించాడు. ఈ ఐపీఎల్ వేలంలో ముంబై రిటెన్షన్ లిస్టులో ఇషాన్ కిషన్‌ను చోటు కల్పించుకోలేదు. ముంబయి ఇండియన్స్ ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, ఈసారి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీ ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది.
ఇషాన్ కిషన్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్
ఇషాన్ కిషన్ విలువను గుర్తించిన సన్ రైజర్స్ అతన్ని భారీ ధరతో కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో, ఇషాన్‌ను తిరిగి సొంతం చేసుకోవడం కష్టమని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఇషాన్ చాలా అద్భుతమైన ఆటగాడని, అతనికి ఏ రకమైన స్కిల్స్ ఉన్నాయో అందరికి తెలుసు అని చెప్పారు. ఇషాన్ ఎప్పుడూ డ్రెస్సింగ్ రూమ్‌ను సంతోషంగా ఉంచేవారని పాండ్యా వివరించారు.