
Sachin Tendulkar: బాగా ఆడావు విరాట్.. త్వరలోనే నా రికార్డును బద్దలు కొడతావు : సచిన్ టెండూల్కర్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా రన్‌మిషన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఎవరికి సాధ్యం కాని రితీలో వైట్‌బాల్ క్రికెట్‌లో 49 సెంచరీలు కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.
ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కూడా కోహ్లీ సమం చేశాడు.
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచులో విరాట్ కోహ్లీ 119 బంతుల్లో సెంచరీ చేశాడు.
సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేయగా, ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా అన్నే శతకాలు బాదాడు.
తన పుట్టిన రోజే నాడు ఈ రికార్డును కోహ్లీ అందుకోవడం విశేషం.ఇక సోషల్ మీడియా వేదికగా కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Details
కొద్ది రోజుల్లోనే విరాట్ నా రికార్డును బ్రేక్ చేస్తాడు : సచిన్
తాజాగా తన రికార్డును విరాట్ కోహ్లీ సమం చేయడంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు.
విరాట్ కోహ్లీ బాగా ఆడానని, తనకు 49 నుంచి 50వ శతకానికి చేరుకునేందుకు 365 రోజుల సమయం పట్టిందని సచిన్ చెప్పాడు.
ఇక విరాట్ కోహ్లీ 49 నుంచి 50వ శతకానికి కొద్ది రోజుల్లో చేరుకొని తన రికార్డును బ్రేక్ చేస్తాడని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.