Shai Hope: వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అరుదైన ఘనత
టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో తేడాతో భారత జట్టు కైవసం చేసుకుంది. మూడో వన్డేల్లో ఐదు పరుగులకే విండీస్ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ పెవిలియానికి చేరాడు. అయినా ఓ అరుదైన ఘనతను అతను సాధించాడు. స్వదేశంలో 1500 పరుగుల సాధించిన 11వ ఆటగాడిగా షాయ్ హోప్ రికార్డుకెక్కాడు. స్వదేశంలో 48వ వన్డేలో తన సగటు 35.78తో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలున్నాయి. విదేశాల్లో 42 మ్యాచుల్లో 2315 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు బాదాడు.
షాయ్ హోప్‌కు టీమిండియాపై మెరుగైన రికార్డు
2019 నుంచి వన్డేల్లో విండీస్ తరుపున హోప్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మొత్తం 74 మ్యాచుల్లో 53 సగటుతో 3,270 పరుగులు చేశాడు. ఇందులో 17 హాఫ్ సెంచరీలు, 11 సెంచరీలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మరే ఏ ఇతర ఆటగాడు ఇన్ని పరుగులు చేయకపోవడం గమనార్హం. పాక్ ఆటగాడు బాబర్‌ఆజం 2,822 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. షాయ్ హోప్‌కు టీమిండియాపై మెరుగైన రికార్డు ఉంది. భారత్‌తో ఆడిన 26 వన్డేల్లో హోప్ 47.04 సగటుతో 988 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు సెంచరీలను బాదాడు. అత్యధికంగా భారత్ 123* పరుగులు చేశాడు. మొత్తంగా వన్డేల్లో 5వేల పరుగులు చేయడానికి షాయ్ హోప్ 60 పరుగులు దూరంలో ఉన్నాడు.