
WI vs ENG: వరుస సిరీస్ విజయాలతో విండీస్ జట్టుకు పూర్వ వైభవం!
ఈ వార్తాకథనం ఏంటి
రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ సాధించిన వెస్టిండీస్(West Indies) జట్టు స్వదేశంలో అదరగొడుతోంది.
ఇప్పటికే ఇంగ్లండ్(England)తో జరిగిన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న విండీస్ జట్టు, తాజాగా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.
వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు తాజాగా పూర్వ వైభవం వైపు అడుగులు వేస్తోంది.
చివరి టీ20ల్లో బౌలర్లు రాణించడంతో రొవ్‌మన్ పావెల్(Rovman Powell) సేన అద్భుత విజయం సాధించారు.
షాయ్ హోప్(Shai Hope) 43 పరుగులతో అజేయంగా రాణించి విండీస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది.
Details
ఇంగ్లండ్ తో జరిగిన టీ20, వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న వెస్టిండీస్
ఇంగ్లండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 19.2 ఓవర్లలోనే చేధించింది.
చివరి ఓవర్లలో విండీస్ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి.
క్రిస్ వోక్స్ వేసిన తొలి బంతికి హోల్డర్ 3 పరుగులు తీశాడు. తర్వాత బంతిని షాయ్ హోప్ సిక్సర్‌గా మలిచాడు.
గుడకేశ్ మోతి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచు'గా నిలవగా, ఫిలిప్ సాల్ట్ కు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' దక్కింది.
ఇక వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం విండీస్ ఇప్పటికే సన్మాహాలను ప్రారంభించింది.
ప్రస్తుతం వెస్టిండీస్ జోరు చూస్తుంటే మూడో సారి టీ20 ఛాంపియన్‌గా నిలవడం ఖాయంగా కన్పిస్తోంది.