ప్రపంచ కప్ ఆడేందుకు వెస్టిండీస్‌కు ఉన్నది ఆ ఒక్క ఛాన్స్ మాత్రమే!
ప్రపంచ కప్ క్రికెట్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచులో అందరినీ ఆశ్చర్యగొలిపే విధంగా స్కాట్లాండు మీద వెస్టిండీస్ ఓడిపోయి ప్రపంచ కప్ ఆడేందుకు అర్హత కోల్పోయింది. స్కాట్లాండుతో జరిగిన మ్యాచులో 43.5ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 181పరుగులు చేసింది వెస్టిండీస్. ఈ లక్ష్యాన్ని స్కాట్లాండ్ 43.3ఓవర్లలోనే ఛేధించింది. అయితే ప్రస్తుతం ప్రపంచ కప్ ఆడేందుకు వెస్టిండీస్‌కు అర్హత లేదని అంటున్నారు. కానీ ఒక్క ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు. ప్రస్తుత వరల్డ్ కప్ ఇండియాలో జరుగనుంది. ఇందుకోసం 10నగరాల్లో మైదానాలు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచులు ఆడేందుకు పాకిస్థాన్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.
పాకిస్తాన్ కారణంగా వెస్టిండీస్‌కు ఛాన్స్ ?
వరల్డ్ కప్ మ్యాచులు జరిగే 10నగరాల్లో పాకిస్థాన్ భద్రతా ప్రతినిధి తనిఖీ నిర్వహిస్తారని అంటున్నారు. ఆ తనిఖీలు పూర్తయితేనే పాక్ జట్టు ఆడుతుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ ఆడకపోతే వెస్టిండీస్‌కు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అదెలా అంటే, ఇప్పటివరకు సూపర్ సిక్స్‌లో వెస్టిండీస్ మూడు మ్యాచులాడింది. మూడింట్లోనూ ఓడిపోయింది. మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిస్తే వెస్టిండీస్‌కు 4పాయింట్లు వస్తాయి. ఈ క్రమంలో అర్హత సాధించన జట్లలో విండీస్ టీమ్ టాప్‌లో ఉంటుంది. తద్వారా వరల్డ్‌కు ఎంపిక అవుతుంది. అయితే ఇదంతా జరగడం అసాధ్యం అని చెబుతున్నారు క్రికెట్ నిపుణులు.
ప్రపంచ కప్ ను రెండు సార్లు గెలుచుకున్న జట్టుకు ఘోర పరాభవం
ఇప్పుడు పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ 5వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో ఒమన్ ఉంది. ఒకవేళ వెస్టిండీస్, మరో రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిచి, అలాగే పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ కంటే పైన ఉన్న జట్లు భారీ తేడాతో ఓడిపోతే వెస్టిండీస్ కు అర్హత వస్తుందట. అది కూడా టోర్నీ నుండి పాకిస్తాన్ వదొలగితేనే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఇది జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ఒకవేళ జరక్కపోతే ప్రపంచ కప్ ను రెండు సార్లు గెలుచుకున్న కరీబియన్ జట్టు, ప్రపంచ కప్ కు అర్హత సాధించకపోవడం అనేది ఘోర పరాభవంగా చరిత్రలో నిలిచిపోతుంది.