
SRH net worth :సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ వర్త్ ఎంతంటే? టాప్ ప్లేయర్ సంపద చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా ఒకటి.
అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర యువ బ్యాటర్ నుంచి, క్లాసెన్, ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమీ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్ల వరకూ చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ బలమైన స్క్వాడ్‌గా కనిపిస్తోంది.
అలాగే టీమ్ ఓనర్, సీఈఓ కావ్య మారన్ కూడా తరచూ స్టేడియంలో కనిపిస్తూ తన టీమ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
అయితే.. ఎస్‌ఆర్‌హెచ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా? కావ్య మారన్ సంపద ఎన్ని కోట్లు? ప్లేయర్లలో ఎవరి నెట్ వర్త్ ఎక్కువ? వంటి ఈ ఆసక్తికర విషయాలు ఇక్కడ చూడొచ్చు.
Details
SRH నెట్ వర్త్ ఎంతంటే?
2012లో సన్ టీవీ నెట్‌వర్క్ SRH ఫ్రాంచైజీని 158 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ జట్టు ఆర్థికంగా చాలా ముందుకు దూసుకెళ్లింది.
2024 నాటికి ఎస్ఆర్‌హెచ్ నెట్ వర్త్ సుమారు రూ. 735 కోట్లు ఐపీఎల్ 2025 ముగిసేలోగా ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయి.
2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సన్ టీవీ నెట్‌వర్క్ ఆదాయం రూ. 4,630.19 కోట్లు కాగా, ఇందులో రూ. 659 కోట్లు SRH ఆదాయం మాత్రమే.
ఇది ఎంత పెద్ద స్కేలులో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎస్ఆర్‌హెచ్ ఆదాయానికి ప్రధానంగా బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్‌షిప్ డీల్స్, టీమ్ జెర్సీ స్పాన్సర్లు, మెర్చండైజ్, మ్యాచ్ టికెట్లు లాంటి వాటే మూలధనం.
Details
కావ్య మారన్ నెట్ వర్త్ ఎంత?
సన్ టీవీ అధినేత కలానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ ప్రస్తుతం SRH CEO. టీవీ, మీడియా రంగాల్లో సంపదను సృష్టించిన కలానిధి మారన్ కుటుంబంలో కావ్యకూ భారీగా షేర్లు ఉన్నాయి. అందుకే కావ్య మారన్ నెట్ వర్త్ రూ. 400 కోట్లకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ల నెట్ వర్త్ వివరాలు
ప్యాట్ కమిన్స్
ఆస్ట్రేలియా కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ కమిన్స్ నెట్ వర్త్ 43 మిలియన్ డాలర్లు. ఎస్ఆర్‌హెచ్ ఆయన్ను రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకుంది.
ట్రావిస్ హెడ్ (రూ. 43 కోట్లు)
ఎస్ఆర్‌హెచ్ ఆయన్ను రూ. 14 కోట్లకు రీటైన్ చేసింది.
Details
హెన్రిక్ క్లాసెన్ (రూ. 50 కోట్లు)
వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్‌ను ఎస్ఆర్‌హెచ్ రూ. 23 కోట్లకు రీటైన్ చేసుకుంది.
అభిషేక్ శర్మ (రూ. 15 కోట్లు+)
ఎస్ఆర్‌హెచ్ ఆయన్ను రూ. 14 కోట్లకు రీటైన్ చేసింది.
నితీశ్ కుమార్ (రూ. 8-15 కోట్లు)
ఈ ఆల్‌రౌండర్‌ను ఎస్ఆర్‌హెచ్ రూ. 6 కోట్లకు కొనుగోలు చేసింది.
మహమ్మద్ షమీ
ప్రముఖ పేసర్ షమీని ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ 2025లో రూ. 10 కోట్లకు సొంతం చేసుకుంది.