
Manoj Tiwari: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోంది.. గంభీర్‌పై మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జట్టులో వివాదాలు పెరిగాయని, సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారని తివారీ పేర్కొన్నారు. రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక గంభీర్ పాత్ర ఉన్నదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జట్టులో అశ్విన్, రోహిత్, విరాట్ వంటి సీనియర్లు ఉంటే, వారికి హెడ్ కోచ్ కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఏదైనా నిర్ణయం వారికి నచ్చకపోతే, వాళ్లు తప్పకుండా ప్రశ్నిస్తారు. ఈ కారణంగా గంభీర్ సీనియర్లపై ఒత్తిడి పెంచి, వారు జట్టులోకి రాకుండా చూసారని మనోజ్ తెలిపారు.
Details
అనవసర వివాదాలను సృష్టిస్తున్నారు
గతేడాది ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు, ఈ ఏడాది మే నెలలో రోహిత్, కోహ్లీలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భాలను తివారీ గుర్తు చేశారు. గంభీర్ తన నిర్ణయాల్లో స్థిరత్వం లేకుండా జట్టులో అనవసర వివాదాలను సృష్టిస్తున్నారని తివారి వెల్లడించారు. తివారీ రోహిత్, కోహ్లీల సేవలను కొనియాడుతూ వాళ్లు దేశం కోసం తమ సర్వస్వాన్ని ధారపోశారు. అలాంటి ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో గౌరవం కోల్పోతే, రిటైర్మెంట్ వైపు మొగ్గుచూపుతారని పేర్కొన్నారు. తదుపరి 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీలను జట్టులో చేర్చకపోతే, అది గంభీర్ తీసుకునే అత్యంత చెత్త నిర్ణయం అవుతుందని తివారీ హెచ్చరించారు.