Page Loader
IND vs ENG: భారత్‌-ఇంగ్లండ్‌ టీ20 పోరులో బోణీ ఎవరిదో?
భారత్‌-ఇంగ్లండ్‌ టీ20 పోరులో బోణీ ఎవరిదో?

IND vs ENG: భారత్‌-ఇంగ్లండ్‌ టీ20 పోరులో బోణీ ఎవరిదో?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 22, 2025
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌, ఇంగ్లండ్‌, మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఇవాళ్టి ప్రారంభమవుతోంది. ఇటీవల జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఎదురైన చేదు అనుభవాలను మరిచిపోవాలంటే, టీమ్‌ఇండియాకు ఈ సిరీస్‌ కీలకమైంది. మరోవైపు ఆగస్టులో జరిగే ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు జట్ల సమతుల్యతను అంచనా వేయడానికి ఈ సిరీస్ ఉపయోగపడనుంది. చారిత్రాత్మక ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌ గెలవడం ద్వారా సిరీస్‌లో పైచేయి సాధించడానికి ఇరుజట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. భారత్‌ యువ క్రికెటర్లతో జట్టును సమతుల్యం చేస్తుండగా, ఇంగ్లండ్‌ తన శక్తివంతమైన బ్యాటింగ్‌ బలంతో ముందుకు సాగుతోంది. పరుగుల వరద ఖాయంగా కనిపిస్తున్న ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ బ్యాటింగ్‌ స్వర్గధామంగా మారనుంది.

Details

రెండు జట్ల మధ్య ఉత్కంఠ పోరు

గాయం నుంచి కోలుకున్న భారత సీనియర్‌ పేసర్‌ షమీ ఈ సిరీస్‌లో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు, అతడి ఆటతీరు భారత జట్టుకు కీలకం కానుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న భారత్ తుది జట్టులో ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉండే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్‌ విభాగంలో సుందర్‌ లేదా నితీశ్‌ రాణించనున్నారని భావిస్తున్నారు. ఇంగ్లండ్‌ జట్టు ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. యువ బ్యాటర్‌ జాకబ్‌ బెతెల్‌ విధ్వంసకర బ్యాటింగ్‌పై ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ భారత్‌కు, ఇంగ్లండ్‌కు తమ బలాలను పరీక్షించడానికి కీలకంగా మారనుంది. రెండు జట్ల మధ్య సమవుజ్జీ పోరాటం అభిమానులకు అద్భుతమైన క్రికెట్‌ అనుభూతిని అందించనుంది.