Page Loader
WPL: యూపీ వారియర్స్‌పై కనికా ఆహుజా సునామీ ఇన్నింగ్స్
ఆర్సీబీని గెలిపించిన కనికా ఆహుజా

WPL: యూపీ వారియర్స్‌పై కనికా ఆహుజా సునామీ ఇన్నింగ్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 16, 2023
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఎట్టకేలకు బోణి కొట్టింది. యూపీ వారియర్స్ జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ తరుపున కనికా ఆహుజా 30 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మొదటి ఐదు గేమ్‌లలో ఓటమిని చవిచూసిన ఆర్సీబీ.. ఆరో మ్యాచ్‌‌ను నెగ్గింది. సోఫీ డివైన్, స్మృతి మంధాన, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్ వంటి ఆటగాళ్లు పెవిలియానికి చేరగా.. కనికా ఆహుజా, రిచా ఘోస్‌తో 60 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివరికి సోఫీ ఎక్లెస్టోన్ చేతిలో కనికా ఆహుజా ఔటైంది.

ఆహుజా

ఈ ఇన్నింగ్స్ మా తల్లికి అంకితం: ఆహుజా

అహుజా ఆగస్టు 7, 2002న పంజాబ్‌లో జన్మించింది. ఆమెకు క్రికెట్ పట్ల ఎక్కువ మక్కువ ఉన్న కుటుంబ సభ్యుల మద్దతు దొరకలేదు. అహుజా తండ్రి చదువుపై దృష్టి పెట్టాలని కోరుతుండగా, ఆమె తల్లి ఆహుజాకి మద్దతు తెలిపింది. తన తల్లి అనారోగ్యంతో భాదపడుతోందని, ఈ ఇన్నింగ్స్ ను తన తల్లికి అంకింతం చేసినట్లు మ్యాచ్ అనంతరం ఆహుజా వెల్లడించింది. ఆర్‌సీబీ ఈ విజయంతో ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఇతర మ్యాచ్‌ ఫలితాలపై మాత్రమే ఆర్‌సీబీ ప్లేఆఫ్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.