WPL: హమ్మయ్య.. ఆర్సీబీ గెలిచిందోచ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు వరుస పరాజయాలకు చెక్ పెడుతూ ఆర్సీబీ ఎట్టకేలకు ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బుధవారం రాత్రి యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ దిగిన యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో 136 పరుగులు చేసి ఆలౌటైంది. హారిస్ గ్రేస్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. దీప్తి శర్మ 22, కిరణ్ నవగిరె 22 పరుగులు చేశారు. లక్ష్య చేధనకు దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కనికా అహుజా 46 పరుగులతో రాణించగా.. చివర్లో రిచాఘోస్ 31 నాటౌట్, హెథర్‌నైట్ 24 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలి విజయం సాధించిన ఆర్సీబీ
ఈ మ్యాచ్‌కు ముందు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వికెట్లు తీయని పెర్రీ మూడు వికెట్లతో సత్తా చాటింది. ఆమె మొదట 19 బంతుల్లో 22 పరుగులు చేసిన దీప్తి శర్మను ఔట్ చేసింది. అనంతరం ఆశా శోభన, సోఫీ డివైన్‌లు చెరొక రెండు వికెట్లు తీశారు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరుకు ఇది తొలి విజయం కావడం విశేషం ఆర్‌సీబీ ఈ విజయంతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఇతర మ్యాచ్ ఫలితాలపై మాత్రమే ఆర్‌సీబీ ప్లేఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.