
Vignesh Puthur: సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చి.. చెన్నైపై సత్తా చాటిన ముంబై బౌలర్.. ఎవరి విఘ్నేష్ పుత్తూర్?
ఈ వార్తాకథనం ఏంటి
కేరళకు చెందిన విఘ్నేశ్ పుతుర్ ఐపీఎల్ లో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు.
చెపాక్ స్టేడియంలో ఆదివారంజరిగిన మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ ముంబయి ఇండియన్స్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఓదశలో చెన్నై సునాయాసంగా గెలుస్తుందని అనుకున్నప్పటికీ, విఘ్నేశ్ తన అద్భుతమైన స్పిన్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు.
తన స్పిన్ మ్యాజిక్‌తో మూడు కీలకమైన వికెట్లు తీసి చెన్నై గెలుపుని కష్టతరం చేశాడు.
ముఖ్యంగా,ఆజట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను తన తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు పంపాడు.
అనంతరం శివమ్ దూబే,దీపక్ హుడాలను కూడా అవుట్ చేయడంతో ముంబై పుంజుకునే అవకాశాన్ని అందించాడు.
అయితే చివర్లో జడేజా సహాయంతో ఓపెనర్ రచిన్ రవీంద్ర జట్టును విజయతీరానికి చేర్చాడు.
వివరాలు
ఆటో డ్రైవర్ కుమారుడి నుంచి ఐపీఎల్ స్టార్ వరకు
గత ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కేవలం రూ.30 లక్షలకే విఘ్నేశ్‌ను కొనుగోలు చేసింది. అతని క్రికెట్ ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉంది.
ఐపీఎల్ అనేకమంది యువ క్రికెటర్ల జీవితాలను మార్చిన అనుభవం ఉంది.పేదరికం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఎందరో ఆటగాళ్లు దీనికి నిదర్శనం.
హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్ కూడా ఒక ఆటో డ్రైవర్ కుమారుడిగానే తన ప్రయాణాన్ని ప్రారంభించి,ఐపీఎల్ ద్వారా టీమ్ ఇండియాలో ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు.
అలాగే, కేరళ రాష్ట్రంలోని మల్లపురానికి చెందిన విఘ్నేశ్ పుతుర్ కూడా ఆటో డ్రైవర్ కుమారుడే.
అతని తల్లి సాధారణ గృహిణి. 24 ఏళ్ల విఘ్నేశ్ రాష్ట్ర సీనియర్ జట్టుకు ఆడకముందే ఐపీఎల్‌కు ఎంపిక కావడం విశేషం.
వివరాలు
పేసర్ నుంచి స్పిన్నర్‌గా మారిన ప్రయాణం
అయితే, అతను అండర్-14, అండర్-19 స్థాయిల్లో కేరళ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్‌లో అలెప్పీ రిపుల్స్ తరఫున ఆడుతున్నాడు. అలాగే, గతంలో తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ పోటీపడ్డాడు.
విఘ్నేశ్ తన కెరీర్‌ను మీడియం పేసర్‌గా ప్రారంభించాడు. కానీ, ఒక స్థానిక క్రికెటర్ సూచన మేరకు లెగ్ స్పిన్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాడు.
ఈ మార్పు కోసం త్రిస్సూర్‌కు వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.తరువాత కేరళ చాలెంజ్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ థామస్ కాలేజ్ తరఫున అద్వితీయ ప్రదర్శన కనబరిచి, అందరి దృష్టిని ఆకర్షించాడు.
వివరాలు
ఎస్‌ఏ 20 లీగ్‌లో నెట్ బౌలర్
ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కారణంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు.
దీంతో ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసి, ఇటీవల ఎస్‌ఏ 20 లీగ్‌లో నెట్ బౌలర్‌గా సౌతాఫ్రికాకు పంపింది.
అక్కడ ఎంఐ కేప్ టౌన్ జట్టుతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ఐపీఎల్‌లో తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసిన విఘ్నేశ్ పుతుర్‌కు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ధోనీనే అబ్బురపరిచాడు
VIDEO OF THE DAY. ❤️
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2025
- MS Dhoni listening to Vignesh Puthur and appreciating him. 🥺🫂pic.twitter.com/bYBVfNCIQs