శ్రీలంకను గెలిపించిన చరిత్ అసలంక ఎవరు? అతని రికార్డులు ఇవే!
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన కీలక మ్యాచులో శ్రీలంక అదరగొట్టింది. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో పాకిస్థాన్ పై శ్రీలంక గెలుపొందింది. చివరి బంతికి లక్ష్యాన్ని చేధించి థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఈ మ్యాచు చివరి ఓవర్‌లో 4, 2 రన్స్ చేసి శ్రీలంకను గెలిపించిన చరిత్ అసలంక గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చరిత్ అసలంక పాక్‌పై 47 బంతుల్లో (3 ఫోర్లు, 1 సిక్స్) 49 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. వాస్తవానికి శ్రీలంక విజయంలో అసలంక కీలక పాత్ర పోషించాడు
చంద్రబాబు
అసలంక 2016లో ఐసీసీ అండర్-19 క్రికెట్ జట్టులో ఆడిన అనుభవం ఉంది. 6 మ్యాచుల్లో 276 పరుగులు చేసి ఆ టోర్నీలో శ్రీలంక తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అసలంక 37 టీ20ల్లో 24.94 సగటుతో 823 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఇప్పటివరకూ 3 టెస్టు మ్యాచుల్లో 14.67 సగటుతో 88 పరుగులు మాత్రమే చేశాడు. 40 వన్డేల్లో 1,272 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీని బాదాడు. లిస్ట్ A క్రికెట్‌లో మొత్తంగా 92 మ్యాచ్‌లలో 42.20 సగటుతో 2,912 పరుగులు చేశాడు.