Pak vs SL: భారత్‌తో ఫైనల్‌లో తలపడేదెవరు? నేడు పాక్, శ్రీలంక మధ్య మ్యాచ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్-2023 ఫైనల్ బెర్తును ఇప్పటికే భారత జట్టు ఖరారు చేసుకుంది. ఇక టీమిండియాతో ఫైనల్ ఆడేది ఎవరో నేటితో తేలనుంది.
పాకిస్థాన్-శ్రీలంక మధ్య నేడు జరిగే మ్యాచులో ఎవరు నెగ్గుతారో ఆ జట్టుతో, ఈనెల 17న భారత్‌తో తలపడనుంది. సూపర్-4లో ఇరు జట్లకూ ఇదే ఆఖరి ఛాన్స్ కాగా, ఈ రెండు జట్లకు మ్యాచ్ నేడు కీలకంగా మారింది.
మరోసారి దయాదితో తలపడాలంటే పాకిస్థాన్, నేడు శ్రీలంకను ఓడించాల్సి ఉంటుంది. కాగా ఈ మ్యాచుకు వరుణుడి ముప్పుఉన్నట్లు ఇప్పటికే శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది.
కొలంబోలో 96శాతం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Details
శ్రీలంక- పాక్ మ్యాచుకు రిజర్వ్ డే లేదు
సూపర్-4లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ తలపడినప్పుడు ఐసీసీ రిజర్వే డేను ఉంచింది. అయితే శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ మ్యాచుకు రిజర్వ్ డేను ఏర్పాటు చేయలేదు.
శ్రీలంక-పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేత తేలాలంటే కనీసం ఇరుజట్లు 20 ఓవర్ల చొప్పున మ్యాచును ఆడాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో శ్రీలంక నెట్ రన్ రేట్ -0.200 ఉండగా, పాకిస్తాన్ నెట్ రన్ రేట్ -1.892 ఉంది.
ఒకవేళ మ్యాచ్ కారణంగా వర్షం పూర్తిగా రద్దు అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంటుంది.