Page Loader
World Cup 2023 : గెలుపు ఎవరిది.. రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫైట్
గెలుపు ఎవరిది.. రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫైట్

World Cup 2023 : గెలుపు ఎవరిది.. రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫైట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2023
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా పోటీపడనుంది. భారత్‌తో జరిగిన తొలి మ్యాచులో ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఎలాగైనా దక్షిణాఫ్రికా పై విజయం సాధించి ఈ టోర్నీలో బోణీ కొట్టాలని ఆసీస్ ఆటగాళ్లు భావిస్తున్నారు. మరోవైపు శ్రీలంకపై అద్భుత విజయాన్ని సాధించిన దక్షిణాఫ్రికా, గెలుపు జోష్‌తో బరిలోకి దిగుతోంది. వన్డేల్లో ఇరు జట్లు 108 సార్లు తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా 54 మ్యాచుల్లో నెగ్గగా, ఆస్ట్రేలియా 50 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇక ప్రపంచ కప్ టోర్నీలో ఆరుసార్లు తలపడ్డగా, ఆసీస్ మూడు విజయాలు, దక్షిణాఫ్రికా రెండు విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.

Details

అరుదైన రికార్డులో చేరువలో డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకూ వన్డేల్లో 45.02 సగటుతో 6,438 పరుగులు చేశాడు. ఇక 62 పరుగులు చేస్తే వన్డేల్లో 6,500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కనున్నాడు. భారత గడ్డపై 13 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 51.33సగటుతో 616 పరుగులు చేశాడు. మరోవైపు స్టీవన్ స్మిత్ వన్డేల్లో 44.34 సగటుతో 5,100 పరుగులు చేశాడు. భారత్‌పై ఆస్ట్రేలియా తరఫున టాప్ స్కోరర్‌గా అతను నిలిచాడు. సౌతాఫ్రికాపై 21 మ్యాచులు ఆడి 40.23 సగటుతో 684 పరుగులు చేశాడు. మార్నస్ లాబుస్‌చాగ్నే ఈ ఏడాది 11 ఇన్నింగ్స్‌లలో 49.10 సగటుతో 491 పరుగులు చేశాడు.

Details

ఆసీస్ పై డేవిడ్ మిల్లర్ కు మెరుగైన రికార్డు

దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ 57.18 సగటుతో 915 పరుగులు చేసి ఆసీస్ పై మెరుగైన రికార్డును సాధించాడు. వన్డేల్లో 43.01 సగటుతో 4,129 పరుగులను చేశాడు. ఈ ఏడాది 59.12 సగటుతో 473 రన్స్ చేశాడు. 2023లో ఐదు అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. క్వింటన్ డి కాక్ శ్రీలంకపై సెంచరీ సాధించి, ఈ టోర్నీలో అదిరే అరంభాన్ని అందుకున్నాడు. వన్డేల్లో 45.15 సగటుతో 6,276 పరుగులు చేశాడు. ఇందులో 18 టన్నులు, 30 అర్ధసెంచరీలను బాదాడు. ఆస్ట్రేలియాపై 909 పరుగులు చేసి సత్తా చాటాడు.

Details

సౌతాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రబడ

సౌతాఫ్రికా తరుఫున కగిసో రబడ ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 14 మ్యాచ్‌లలో రబడ 26.57 సగటుతో 26 వికెట్లను పడగొట్టాడు. తన 50వ వన్డే ఆడనున్న లుంగి ఎన్‌గిడి 27.87 సగటుతో 79 వికెట్లను సాధించాడు. ప్రపంచ కప్ టోర్నీలో మిచెల్ స్టార్క్ 15.14 సగటుతో 50 వికెట్లు తీసి, సంచలన ఫామ్‌లో ఉన్నాడు. అతను 112 మ్యాచ్‌లలో 22.27 సగటుతో 221 వికెట్లను తీశాడు.