Page Loader
Gambhir-Manoj Tiwary:'గౌతమ్ గంభీర్ నా కుటుంబాన్నివేధించాడు'.. అందుకే 'హిపోక్రైట్': మనోజ్ తివారీ 
'గౌతమ్ గంభీర్ నా కుటుంబాన్నివేధించాడు'.. అందుకే 'హిపోక్రైట్': మనోజ్ తివారీ

Gambhir-Manoj Tiwary:'గౌతమ్ గంభీర్ నా కుటుంబాన్నివేధించాడు'.. అందుకే 'హిపోక్రైట్': మనోజ్ తివారీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ పై, అతని ఒకప్పుడు సహచరుడు అయిన మనోజ్ తివారీ తీవ్రమైన విమర్శలు చేశారు. గతంలో గంభీర్‌ను 'హిపోక్రైట్' అని పిలిచిన తివారీ,దానికి సంబంధించిన కారణాలను వివరిస్తూ,2015 రంజీ ట్రోఫీ సమయంలో గంభీర్ తో జరిగిన వాగ్వాదాన్ని గుర్తు చేసుకున్నారు. గంభీర్ పై ఆరోపణలు చేస్తున్న తివారీ,అతని మాటలు, చేతలలో పెద్ద తేడా ఉందని తెలిపారు. గంభీర్ 2015లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, విదేశీ కోచ్‌లు ఎప్పుడూ భావోద్వేగాలపై దృష్టి పెట్టరు, డబ్బు సంపాదించుకోవడం మాత్రమే వారి లక్ష్యమని వ్యాఖ్యానించిన విషయం గురించి తివారీ తెలిపారు. కానీ, కోచ్‌గా నియమితుడైన గంభీర్ మాత్రం విదేశీ కోచ్‌లను నియమించుకుని, ఈ విషయానికి వ్యతిరేకంగా వ్యవహరించాడు.

వివరాలు 

ఆ రెండూ ఒకటి కాదు.. 

గంభీర్ సాధించిన ఫలితాలను తివారీ విమర్శిస్తూ, అతని దిశా నిర్దేశం సరైనదిగా లేదని అన్నారు. ముఖ్యంగా, గంభీర్ నేతృత్వంలో జట్టు పలు పతనాలను ఎదుర్కొన్న నేపథ్యంలో, క్రికెట్ లో గెలుపోటములు సహజం అయినప్పటికీ, ఓడినప్పుడు దానిపై సమీక్ష అవసరమని పేర్కొన్నారు. రాహుల్ ద్రావిడ్ జట్టును విజయవంతంగా నడిపించి, ఆ జట్టును గంభీర్‌కు అప్పగించగా, ఇప్పుడు గంభీర్ ఆ జట్టును వెనక్కి నడిపిస్తున్నాడని తివారీ అన్నారు. గంభీర్‌కు కోచ్‌గా ఎలాంటి అనుభవం లేదని,అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ లేదా ఐపీఎల్ లో కోచ్‌గా పనిచెయ్యలేదని తివారీ స్పష్టం చేశారు. కోచ్,మెంటార్ మధ్య తేడాలను కూడా వివరిస్తూ,గంభీర్ కోచ్‌గా తన పొరపాట్లను స్వీకరించి, వాటి నుంచి నేర్చుకోవాలని, లేకపోతే అతనికి విజయాలు సాధించడం కష్టమే అని చెప్పారు.

వివరాలు 

నాపైనే కాదు.. గంగూలీపైనా వ్యాఖ్యలు 

ఇక, 2015 రంజీ ట్రోఫీ సీజన్లో గంభీర్‌తో జరిగిన వాగ్వాదం గురించి తివారీ మాట్లాడుతూ, గంభీర్ తన కుటుంబ సభ్యులపై కూడా దారుణంగా మాట్లాడినట్లు వెల్లడించారు. అతడు సౌరభ్ గంగూలీపై కూడా ఏవో చెత్త పదాలు వాడాడు.. ఆ సమయంలో ఇతర క్రికెటర్లు అతడిని కాపాడారు. లేకపోతే పరిస్థితి విభిన్నంగా ఉండేది'' అని వ్యాఖ్యానించాడు.