WI vs IND: భారత జట్టుకు పరీక్షగా మారిన నాలుగో టీ20; అందరి కన్ను అతని మీదే
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో టీమిండియా ఆడుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచులు పూర్తయ్యాయి.
మొదటి రెండు మ్యాచుల్లో వెస్టిండీస్ గెలిచింది. మూడో మ్యాచులో హార్దిక్ సేన సునాయాసంగా విజయం సాధించింది.
నాలుగో టీ20 శనివారం జరగనుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో లాడర్ హిల్ ప్రాంతంలో ఈ మ్యాచ్ జరగనుంది.
అర్థరాత్రి 8గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. నాలుగో మ్యాచ్ కచ్చితంగా హార్దిక్ సేన గెలవాలి.
లేదంటే టీ20 సిరీస్ వెస్టిండీస్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది.
ఈ మ్యాచులో తిలక్ వర్మ కీలకం కానున్నాడు. గతకొన్ని రోజులుగా స్థిరమైన బ్యాటింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
నాలుగో మ్యాచులో తిలక్ వర్మ బ్యాటింగ్ మెరుపులు ఎలా ఉంటాయోనని అందరూ ఎదురుచూస్తున్నారు.
Details
నాలుగో టీ20లో పరుగుల వరద పారుతుందా?
లాడర్ హిల్ మైదానం పిచ్ బ్యాటింగుకు అనుకూలించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
గతంలో ఈ మైదానంలో వెస్టిండీస్‌తో ఆడిన ఇండియా, వరుసగా 191/5, 188/7 పరుగులు చేసింది. ఈ రెండు మ్యాచుల్లో భారత్‌కు విజయం దక్కింది.
నాలుగో టీ20లో భారత బౌలర్లు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. బ్యాటింగ్ పిచ్ కావడం వల్ల వెస్టిండీస్ బ్యాటర్లు పరుగుల వరద పారించడానికే చూస్తారు.
అర్ష్ దీప్, కుల్ దీప్ చాహల్ మెరుగైన ప్రదర్శన ప్రదర్శించి పరుగులను అడ్డుకోగలిగితే బాగుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరి నాలుగో మ్యాచులో ఇండియా టీమ్ ఏ విధంగా ఆడుతుందో చూడాలి.