
WI vs USA: అమెరికా జట్టులో సంగం మంది ఇండియన్ ప్లేయర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ క్యాలిఫయర్ మ్యాచులో వెస్టిండీస్, యూఎస్ఏ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో యూఎస్ఏపై వెస్టిండీస్ జట్టు 39 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే వెస్టిండీస్‌తో తలపడిన అమెరికా జట్టులో సగం మంది ఇండియన్ ప్లేయర్లు ఉండడం విశేషం.
సుశాంత్ మదోనీ, సాయితేజ ముక్కామల, మోనాంక్ పటేల్ అమెరికా క్రికెటర్స్ అయినా వీరంతా ఇండియానికి చెందిన వారు. కాగా వారు అమెరికా తరుపున బరిలోకి దిగారు.
జింబాబ్వే వేదికగా వన్డే వరల్డ్ కప్ క్యాలిఫయర్ టోర్నీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం వెస్టిండీస్, అమెరికా మ్యాచ్ జరిగింది. ఈ జట్టులో యుఎస్ ఓపెనర్ సుశాంత్ మదోనీ మహరాష్ట్రలో జన్మించగా.. సాయితేజ ఇండియన్ ఎన్ఆర్ఐ కావడం గమనార్హం.
Details
వెస్టిండీస్ చేతిలో యూఎస్ఏ జట్టు ఓటమి
అదే విధంగా యూఎస్ఏ జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ గుజరాత్ లో పుట్టాడు. వారితో పాటు జాన్‌దీప్ సింగ్, సౌరబ్ నేత్రవాల్కర్ ముంబాయి, ఉస్మాన్ రఫీక్ పంజాబ్ తో పాటు మరికొంత మంది ఆటగాళ్లు అమెరికా తరుపున ఆడారు.
దీంతో అమెరికా జట్టుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి. ఇది అమెరికా జట్టు కాదని, ఇండియా ఏ జట్టు వెస్టిండీస్ జట్టుతో ఆడుతున్నట్లుగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. ఛార్లెస్ 66, హోల్డర్ 56, ఛేజ్ 55 పరుగులతో ఆకట్టుకున్నారు.
లక్ష్య చేధనలో అమెరికా జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 258 పరుగులు మాత్రమే చేసింది.