Page Loader
AUS vsAFG: ఆసీస్‌కు అఫ్గాన్ షాక్ ఇవ్వనుందా? ఇవాళ సెమీస్ రేసులో కీలక పోరు!
ఆసీస్‌కు అఫ్గాన్ షాక్ ఇవ్వనుందా? ఇవాళ సెమీస్ రేసులో కీలక పోరు!

AUS vsAFG: ఆసీస్‌కు అఫ్గాన్ షాక్ ఇవ్వనుందా? ఇవాళ సెమీస్ రేసులో కీలక పోరు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర సమరానికి సర్వం సిద్ధమైంది. సెమీఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్లు పోటీపడనున్నాయి. బలమైన ఇంగ్లాండ్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అఫ్గాన్, మరో అద్భుత విజయంతో ముందంజ వేయాలనే లక్ష్యంతో ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన అఫ్గానిస్థాన్, వరుసగా రెండో ఐసీసీ మెగా టోర్నీలోనూ తుది నాలుగులో అడుగుపెట్టే అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఇంగ్లాండ్‌పై మెరుపు శతకం సాధించిన ఇబ్రహీం జద్రాన్, అయిదు వికెట్లు తీసిన అజ్మతుల్లా ఒమర్‌జాయ్ మరోసారి కీలకంగా మారనున్నారు.

Details

బౌలింగ్ లో బలంగాఆప్గాన్

ఇంకోవైపు, రెండు సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన ఆసీస్, రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో వర్షం కారణంగా పాయింట్లు పంచుకుంది. దీంతో అఫ్గానిస్థాన్‌తో పోరు ఆసీస్‌ జట్టుకు క్వార్టర్‌ఫైనల్‌లా మారింది. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ లేని పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్‌లో ఆసీస్ మెరుగైన ప్రదర్శనను కనబరిచింది. బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటింగ్‌లో ఆసీస్ బలంగా ఉంది.

Details

ఆసీస్ జట్టులో మ్యాచ్ విన్నర్లు

ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉండటం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. అయితే గతేడాది టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ చేతిలో ఓటమిపాలైన ఆసీస్, ఈసారి వారి బలాన్ని తేలిగ్గా తీసుకుంటే మరో పరాభవాన్ని ఎదుర్కొనాల్సి రావచ్చు. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకూ ఈ మ్యాచ్ అత్యంత కీలకం. మరి అఫ్గాన్ మరో అద్భుతాన్ని నమోదు చేస్తుందా? లేక కంగారూలు తమ అనుభవాన్ని ఉపయోగించుకుని విజయాన్ని ఖాయం చేసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.