
Arshdeep singh: ఒమన్‌తో మ్యాచ్‌లోనైనా అర్ష్‌దీప్ సింగ్'కు తుది జట్టులో చోటు దక్కుందా ? లేదా ?
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. వరుసగా రెండు విజయాలను నమోదు చేసి ఇప్పటికే సూపర్-4 దశలో అడుగుపెట్టింది. గ్రూప్ స్టేజ్‌లో తమ చివరి పోరును శుక్రవారం (సెప్టెంబర్ 19)న ఒమాన్‌తో ఆడనుంది. ఈ నేపథ్యంతో ఆ మ్యాచ్‌లో భారత్ తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతోందన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఒమన్‌పై గెలుపు సాధించడం టీమిండియాకు పెద్ద సవాల్‌గా కనిపించడం లేదు. అయితే ఆ తర్వాత ఆదివారం (సెప్టెంబర్ 21) సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌తో పోరాడాల్సి ఉంటుంది. ఈ రెండు కీలక మ్యాచ్‌ల మధ్య కేవలం ఒక్క రోజు విరామం మాత్రమే ఉన్న నేపథ్యంలో, ఒమన్ మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి.
వివరాలు
బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కి జట్టులో అవకాశం
ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను పాక్‌తో బరిలో తాజాగా ఉంచేందుకు అతడికి విశ్రాంతి ఇవ్వవచ్చని సమాచారం. అలా జరిగితే,బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కి జట్టులో అవకాశం దక్కే అవకాశముంది. ఒకప్పుడు టీ20ల్లో రెగ్యులర్ బౌలర్‌గా ఉన్న అర్ష్‌దీప్,ఇటీవలి కాలంలో తుది జట్టులో స్థానం పొందడంలో విఫలమవుతున్నాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరఫున ఇప్పటివరకు 99వికెట్లు తీసిన అర్ష్‌దీప్, అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు. శతక వికెట్ల క్లబ్‌లో చేరేందుకు అతనికి ఇంకా ఒక్క వికెట్ అవసరం.గత ఆరు నెలలుగా ఆ మైలురాయిని అందుకోవాలని ఎదురుచూస్తున్న అతడు, ఒమాన్ మ్యాచ్‌లో ఆ అవకాశం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అతడు వికెట్ తీసి చరిత్ర సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వివరాలు
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* అర్ష్‌దీప్ సింగ్ - 63 మ్యాచుల్లో - 99 వికెట్లు *యుజ్వేంద్ర చాహల్ - 80 మ్యాచుల్లో 96 వికెట్లు *హార్దిక్ పాండ్యా - 114 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు *జస్‌ప్రీత్ బుమ్రా - 70 మ్యాచుల్లో - 92 వికెట్లు * భువనేశ్వర్ కుమార్ - 87 మ్యాచుల్లో - 90 వికెట్లు