LOADING...
ఈసారీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆట మారేనా..?
ముంబై ఇండియన్స్ ఐదు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది

ఈసారీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆట మారేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2023
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

గతేడాది ఐపీఎల్ సీజన్‌లో ముంచై ఇండియన్స్ చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ముంబై 2008 తర్వాత పాిిియింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడం గతేడాది మొదటిసారి. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ ఛాంపియన్ విజేతగా ముంబై ఇండియన్స్ తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది పూర్వపు ఫామ్‌ను అందుకొని మరోసారి టైటిల్ కొట్టాలని ముంబై గట్టి పట్టుదలతో ఉంది. కెప్టెన్ రోహిత్‌శర్మ ముంబైని ముందుడి నడిపిస్తున్నారు. 227 ఐపీఎల్ మ్యాచ్‌లో 5,879 పరుగులు చేశాడు. ఇందులో 32 అర్ధ‌సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. 6వేల పరుగులు చేరుకోవడానికి 121 పరుగుల దూరంలో ఉన్నాడు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 268 పరుగులు చేసి రోహిత్ నిరాశపరిచాడు.

బుమ్రా

ఐపీఎల్ సీజన్‌కు బుమ్రా దూరం

ఇషాన్ కిషన్ 14 మ్యాచ్‌ల్లో 418 పరుగులు చేసి గత సీజన్‌లో ముంబై తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టీ20ల్లో నంబర్ ర్యాంక్ సాధించిన సూర్యకుమార్ యాదవ్ 3వేల పరుగులు చేయడానికి 356 పరుగుల దూరంలో నిలిచాడు. యువ ఆటగాడు తిలక్ వర్మ తన అరంగేట్రం సీజన్‌లో 397 పరుగులు చేశాడు. బిగ్ హిట్టర్ టీమ్ డేవిడ్ 160 టీ20ల్లో 3,460 పరుగులు చేశాడు. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ముంబై బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్ మీద ఆధారపడి ఉంది. ఐపీఎల్‌లో 35 మ్యాచ్‌లు ఆడి 46 వికెట్లు తీశాడు. స్పిన్ విభాగంలో పీయూవా చావ్లా, కుమార్ కార్తికేయ రాణించే అవకాశం ఉంది.