Virat Kohli: సచిన్ రికార్డులపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. సెమీస్‌లో బద్దలు కొడతాడా..?
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో 99 సగటుతో 594 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలున్నాయి.
చివరి ఐదు మ్యాచ్‌లలో కోహ్లీ 83.75 సగటుతో 335 పరుగులు చేశాడు. ఈ ప్రపంచ కప్‌లో మూడు రికార్డులకు కోహ్లీ చేరువయ్యాడు.
ఈ రికార్డులన్నీ టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండడం గమనార్హం.
ఇప్పటివరకూ విరాట్ కోహ్లీ 49 వన్డేలను సాధించి సచిన్‌తో కలిసి సంయుక్తంగా కొనసాగుతున్నాడు.
Details
సచిన్ రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ
ఇక వన్డే ప్రపంచ కప్‌లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో కోహ్లీ ఇప్పటివరకూ 594 పరుగులతో చేశాడు.
ఈ రికార్డును కోహ్లీ అధిగమించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
మరోవైపు క్వింటన్ డికాక్, రచిన్ రవీంద్ర నుంచి కోహ్లీకి పోటీ ఎదురు కానుంది.
విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్ ఏడుసార్లు 50ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు.
దీంతో సచిన్(7), షకీల్ అల్ హసన్ (7)తో కలిసి సంయుక్తంగా కొనసాగుతున్నాడు.
ఇవాళ జరిగే మ్యాచులో ఒక్క హాఫ్ సెంచరీ సాధిస్తే వారిద్దరిని విరాట్ అధిగమించే అవకాశం ఉంది.