IPL2023: ఫ్లే ఆఫ్స్ కు వెళ్లిన లక్నో.. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ పై విజయం
తప్పక గెలవాల్సిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ సత్తా చాటింది. ఈడెన్ గార్డన్స్ లో జరిగిన మ్యాచులో కేకేఆర్ పై ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో అఖరికి లక్నోనే పైచేయి సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ 30 బంతుల్లో 58 పరుగులు చేసి చెలరేగారు. డికాక్(28), మార్కేండ్(26), బదోని 25 రన్స్ తో పర్వాలేదనిపించారు. కోలకత్తా బౌలర్లలో సునీల్ నరైన్, శార్దుల్ ఠాకూర్, వైభవ్ ఆరోరా తలా రెండు వికెట్లతో రాణించారు.
రింకూ సింగ్ పోరాటం వృథా
లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. వెంకటేష్ అయ్యర్ 24 పరుగులు చేశాడు. జేసన్ రాయ్ 28 బంతుల్లో 45 పరుగులు చేసి ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో కృనాల్ పాండ్యా పది ఓవర్లో రాయ్ ని ఔట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. చివర్లో రింకూసింగ్ 33 బంతుల్లో 67 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరి ఓవర్లలో 21 పరుగులు అవసరం కాగా.. రింకూసింగ్ 1,Wd,0,0,1,Wd,6,4,6 చెలరేగాడు. చివరి బంతికి సిక్సర్ కొట్టినా 175 పరుగుల వద్దే అగిపోయి, కేకేఆర్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. కేకేఆర్ బౌలర్లలో రవి బిషోని, యాష్ ఠాకూర్ తలా రెండు వికెట్లతో రాణించాడు.