Women's ODI World Cup 2025: భారత అమ్మాయిలకు కీలక పోరు.. వన్డే ప్రపంచకప్‌లో నేడు కివీస్‌తో ఢీ
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌లలో 4 పాయింట్లు మాత్రమే సాధించిన భారత్,సమానంగా పాయింట్లతో ఉన్న న్యూజిలాండ్‌పై గురువారం విజయం సాధించడానికి యత్నిస్తోంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో చివరి మూడు మ్యాచ్‌లలో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోలేక భారత జట్టు ఓటమి చవిచూసింది హర్మన్‌సేన. భారత్ బాగా ఆడినా, అవకాశాలను పునరావృతం చేసుకోలేక ఓడిపోయింది. మళ్లీ అలాంటి తప్పులు జరిగితే, సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరడం కష్టం అవుతుంది. ఈ మ్యాచ్ ఓడినా కూడా,భారత్‌కు అవకాశం ఉంటుంది. అందుకు వేరే సమీకరణాలు కలిసి రావాలి. కివీస్‌ను ఓడిస్తే, చివరి మ్యాచ్‌లో బలహీన బంగ్లాదేశ్‌పై గెలిచి నేరుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
వివరాలు
వీళ్లతో జాగ్రత్త:
ప్రధాన బ్యాటర్లు స్మృతి, హర్మన్ ఫామ్ అందుకోవడం.. ప్రతీక, హర్లీన్, దీప్తి, రిచా కూడా లయలోనే ఉండడం భారత్‌కు సానుకూలాంశం. అయితే ఫినిషింగ్‌లో భారత్ ఇబ్బందుల్లో పడుతోంది. బౌలింగ్ పరంగా కీలక సమయాల్లో వికెట్లు తీసుకోవడం, పరుగులు అడ్డుకోవడంలో తడబడుతోంది ఈ లోపం కారణంగా వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడింది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు దీప్తి, శ్రీచరణిలపై భారత్ ఎక్కువ ఆశలు పెట్టింది. ప్రత్యర్థి జట్టులో ఆల్‌రౌండర్లు అమేలియా కెర్, సోఫీ డివైన్ కీలక భూమిక పోషిస్తారు. వీరితో పాటు సుజీ బేట్స్, బ్రూక్ హాలిడే, జెస్ కెర్ సత్తా చాటుతారని కివీస్ ఆశిస్తోంది.
వివరాలు
బౌలరా.. బ్యాటరా.. ఆల్‌రౌండరా?
ముందు మ్యాచ్‌లలో ఆరో బౌలర్లు లేకపోవడం సమస్యగా కనిపించింది. ఇంగ్లాండ్‌పై, బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను తప్పించి, పేసర్ రేణుక సింగ్‌ను ఆడించారు. కానీ ఈ నిర్ణయం పెద్ద ఫలితాన్ని ఇవ్వలేదు. రేణుక బౌలింగ్‌లో పొదుపుగా ఉన్నప్పటికీ, వికెట్ తీయలేకపోయింది. బ్యాటింగ్‌లో జెమీమా లేని లోటు కూడా స్పష్టంగా కనిపించింది. మరి కివీస్‌పై ఎవరు ఆడతారో చూడాలి. బ్యాటింగ్ కూడా చేయగల స్పిన్నర్ రాధ యాదవ్‌ను ఆడించడానికి అవకాశం ఉంది. ఇంతకుమించి జట్టులో మార్పులేమీ ఉండకపోవచ్చు.
వివరాలు
పిచ్
ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం. స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది. మ్యాచ్‌కు కొంతమేర వర్షం ముప్పు ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: స్మృతి, ప్రతీక, హర్లీన్, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), దీప్తి, రిచా, స్నేహ్, అమన్‌జ్యోత్, జెమీమా/రేణుక, శ్రీచరణి, క్రాంతి; న్యూజిలాండ్: సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్, బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా, జెస్ కెర్, రోజ్‌మేరీ, తహుహు, ఈడెన్ కార్సన్. 57 భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డేలు. 22 మ్యాచ్‌ల్లో భారత్ గెలవగా.. 34 వన్డేలు కివీస్ సొంతమయ్యాయి. ఒక మ్యాచ్ టై అయింది.